కోల్‌కతా: అండర్-19 ట్రై సిరీస్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో మంగళవారం భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. సుందర్ వాషింగ్టన్ ఆల్-రౌండర్‌గా రాణించాడు. బంగ్లాదేశ్ జట్టు 223 రన్ల లక్షాన్ని పెట్టగా భారత్ ఛేదించేందుకు రిషభ్ పంత్(51), ఇషాన్ కిషన్(24)లతో ఫ్లయింగ్ స్టార్ట్ చేసింది. వారిద్దరూ 33 బంతుల్లో 67 రన్లు చేశారు. సుందర్(50),అమన్‌దీప్ ఖారే(41) కలసి 69 పరుగులు చేశారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ రెండవ కాంపస్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ఇంకా తొమ్మిది బాల్స్ మిగిలి ఉండ గానే భారత్ విజయం సాధించింది. ఆరవ స్థానంలో వచ్చిన సుం దర్ బాగా రాణించాడు. చెన్నైకు చెందిన ఈ 16 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ ఆటగాడు చాలా నింపాదిగా ఆడి 75 బంతుల్లో 50 రన్లు( ఆరు ఫోర్లతో) సాధిం చాడు. తన ఆఫ్‌స్పిన్‌తో 25పరుగులిచ్చి 2వికెట్లు కూ డా తీసుకు న్నాడు. కోచ్ రహుల్ ద్రవిడ్ జట్టులో ప్రతి ఒక్కరిని ఉత్సాహప రిచాడని అతడన్నాడు. మూడు మ్యాచ్‌లలో 13 పాయింట్లు సాధించి భారత జట్టు ఆదివారం ఆడబోయె ఫైనల్లో ప్రవేశించింది. బంగ్లాదేశ్ ఒక గెలుపుతో 5పాయింట్లు సాధిం చింది. బంగ్లాదేశ్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను బుధవారం ఆఫ్ఘని స్తాన్‌తో ఆడనున్నది. ఆప్ఘనిస్తాన్ ఇంత వరకు ఓ గెలుపు కూడా సాధించలేదు.
క్లుప్తంగా స్కోర్లు: బంగ్లాదేశ్ అండర్-19: 222/7(50 ఓవర్లలో); భారత్ అండర19: 223/6(48.3 ఓవర్లలో). భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.