Wednesday, April 24, 2024

పండుగలా జెండాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

బాజాభజంత్రీలతో ఇంటింటికీ తిరిగిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు

మన దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాజాభజంత్రీలతో ఇంటింటికీ తిరుగుతూ జాతీయ జెండాలను ఉత్సాహంగా పంపిణీ చేశారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు భారతదేశ కీర్తిని దశదిశలా వ్యా పించేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై త్రివ ర్ణ పతాకం ఎగురవేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ జాతీయ జెండా ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరికీ మువ్వెన్నల జెం డాలు పంచుతూ దేశభక్తిని పెంపొందించారు. సిద్దిపేట జిల్లా ములుగులో వజ్రోత్సవాల్లో భా గంగా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఇంటింటికి జాతీయ జెండాలను ఆ ర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పంచారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వజ్రోత్సవాలను జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. మ హానీయుల కృషిని గుర్తించేందుకు ఈ వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ తరం పిల్లలకు స్వాతంత్య్ర పోరాట పటిమను తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు 15 న ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని ఆయన సూచించారు.

సమర యోధులను స్మరించుకునే విధంగా: మంత్రి వేముల

వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకల కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమర యోధులను స్మరించుకునే విధంగా,వారి పోరాట ప్రతిమను గుర్తుచేసుకునే విధంగా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.

మున్సిపల్ కౌనిలర్లకు జెండాల అందజేత: మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండలో స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు మున్సిపల్ చైర్మన్‌తో సహా కౌన్సిలర్లకు జాతీయ పతకాలను మంత్రి అందజేశారు.

కోటి 20 లక్షల జాతీయ జెండాల పంపిణీ: తలసాని

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా నగరంలోని నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతకాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో స్వాతంత్ర వజ్రోత్సవాలు ఈనెల 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో కోటి 20 లక్షల జాతీయ జెండాలు పంపిణీ చేస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News