Thursday, April 25, 2024

మహిళల అండర్19 వరల్డ్‌కప్.. ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

పొచెఫ్‌స్ట్రూమ్: మహిళల అండర్19 టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్లు అన్నా బ్రొనింగ్ (1), ఎమ్మా మెక్‌లాయిడ్ (2) విఫలమయ్యారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ప్లిమ్మర్ (35), వికెట్ కీపర్ గాజే (26) కొద్ది సేపు పోరాటం కొనసాగించారు.

అయితే భారత బౌలర్ పర్శవి చోప్రా అద్భుత బౌలింగ్‌తో కివీస్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. చోప్రా 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. కెప్టెన్ షపాలీ వర్మ 4 ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శ్వేత షెరావత్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్వేత 45 బంతుల్లోనే 10 ఫోర్లతో 61 పరుగులు చేసి అజేయం నిలిచింది. కెప్టెన్ షఫాలీ (10), సౌమ్య తివారి (22) ఆమెకు అండగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News