Thursday, March 28, 2024

అమెరికాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియా

- Advertisement -
- Advertisement -

India is America's largest trading partner

రేస్‌లో వెనుకబడ్డ చైనా… గణాంకాలతో వెల్లడి

వాషింగ్టన్/ న్యూఢిల్లీ : చైనాను తలదన్నుతూ ఇండియా ఇప్పుడు అమెరికాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయింది. 202122లో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య విస్తరిస్తోన్న ఆర్థిక సంబంధాల దిశలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా అమెరికాకు టాప్ ట్రేడింగ్ పార్టనర్ అయిందని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారిక గణాంకాలతో తేటతెల్లం అయింది. ఈ సంవత్సరంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 119.42 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ఇంతకు ముందు ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికాకు ఎగుమతులు కూడా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతుల విలువ 51.62 బిలియన్ డాలర్లు ఉండేది. అది ఇప్పుడు 76.11 బిలియన్ డాలర్లకు చేరింది. దిగుమతుల స్థాయి కూడా పెరిగింది. ఇక చైనాతో ఇచ్చిపుచ్చుకునే స్థాయి వాణిజ్య లావాదేవీలు 2021 22లో 115.42 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు ఇది 86.4 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనాకు ఎగుమతులు స్వల్పంగా పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇవి 21.18 బిలియన్ డాలర్లు ఉంటే, ఇప్పుడు అవి 21.25 బిలియన్ డాలర్లకు పెరిగాయని వాణిజ్య శాఖ డాటాతో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News