Home ఎడిటోరియల్ జారుడుబల్లపై రూపాయి

జారుడుబల్లపై రూపాయి

curency

పూర్తిగా లేక పాక్షికంగా మార్పిడి జరిగే ప్రధానమైన ప్రపంచ కరెన్సీలతో పోల్చినపుడు భారతదేశ రూపాయి నిలకడగా తిరోముఖం గా ప్రయాణించటం ఆందోళనకు ప్రధాన కారణమవుతున్నది. ఈ సంవత్సరం జనవరి 1న స్పాట్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్‌లో 1 అమెరికన్ డాలర్ = రూ. 63.80 27. కేవలం 6 మాసాల్లో భారత రూపాయి విలువ 8 శాతం తగ్గి డాలర్‌తో మారక విలువ రూ. 68.80కు దిగజారింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ భావి అంచనా ప్రకారం, ఈ సంవత్సరం నవంబర్ నాటికి డాలర్‌తో రూపాయి మారక విలువ రూ. 72.78కి పతనం కావచ్చు. అంటే 11 మాసాల్లో 14 శాతం విలువ తరుగుతుంది. భారతీయ రూపాయి నిలకడగా బలహీనపడుతున్నది.ఆర్థిక వృద్ధి రేటు అంచనా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ రూపాయి మారక విలువ భవిష్యదంచనా నిరాశాజనకంగా ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో కూడిన బ్రిక్స్ (BRICS) గ్రూపులో కరెన్సీ విలువ పతనంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం రూపాయికన్నా ఎక్కువ విలువ కోల్పోయింది రష్యన్ రూబుల్ ఒక్కటే.
రూపాయి విలువ నిలకడగా తరుగుతూ ఉండటం దేశ వాణిజ్య, ద్రవ్య మేనేజిమెంట్‌లో ఏదో తీవ్రమైన లోపమున్నట్లు సూచిస్తున్నది. భారత కరెంట్ అక్కౌంట్ లోటు (సిఎడి) పెరగటానికి, రూపాయి విలువ తరుగుదలకు ఈ సంవత్సరం ఆయిలు దిగుమతి బిల్లు పెరగటం కీలకమైన కారణం కావచ్చు. అయితే వాణిజ్య ఖాతాలో నివారించదగిన వస్తువుల దిగుమతిని కుదించటం ద్వారా, సర్వీసు ఖాతాలో విలాసవంతమైన వ్యయాన్ని తగ్గించటం ద్వారా, అమెరికన్ డాలర్లు దేశం నుంచి బయటకు వెళ్లటాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం నుంచి గట్టి ప్రయత్నమేదీ కనిపించదు. సర్వీసు ఖాతాలో విదేశీ ప్రయాణం, పలు రకాల ఖాతాలపై విదేశీ మారకం బదిలీ, విదేశాల్లో కార్పొరేట్ల అనుత్పాదక పెట్టుబడులు, విదేశీ విద్య, రుణాలకు చెల్లింపులు వగైరా ఉంటాయి. క్రూడ్ ఆయిలుకు అంతర్జాతీయ ధరలు గూర్చి భారత దేశం చేయగలిగిందేమీ లేదు. అయితే వాణిజ్య లోటును, పెట్టుబడి బయటకు వెళ్లటాన్ని అదుపు చేసేందుకై అది ఇతర రంగాలను తప్పక పరిశీలించవచ్చు.అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకా రం, ఈ సంవత్సరం భారీగా విలువ తరిగిన ఆసియా కరెన్సీల్లో రూపాయి ఒకటి. వాస్తవిక పరిమాణంలో ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించాలని భారత్ ఆశపడటం కాడ్ (సిఎడి) నిలకడగా పెరుగుతున్న స్థితిలో ఏదో నిస్సారంగా కనిపిస్తున్నది. జిడిపికి భారత్ ఎగుమతుల దోహదం 201718లో గత 14 ఏళ్లలో అధమ స్థాయిని చేరింది. కాగా దిగుమతులు కలత కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. దేశ వాణిజ్య లోటు 201617 లో 112.4 బిలియన్ డాలర్ల నుంచి 201718లో 160 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ వాణిజ్య లోటులో 60 బిలియన్ డాలర్లు ఒక్క చైనాతో వాణిజ్య ఖాతాలోనే ఉంది. భారత్‌కు వ్యాపార వస్తువుల ఎగుమతిలో చైనా అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. వాటిని బాగా తగ్గించాలి లేదా కఠినంగా నియంత్రించాలి.
201718లో చైనాకు భారత్ ఎగుమతుల విలువ 13.3 బిలియన్ డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు 76.2 బిలియన్ డాలర్లు. ఈ అతి హెచ్చు వాణిజ్య అసమతులనాన్ని పరిష్కరించుకుందామని చైనా చాలా సార్లు భారత్‌కు మాట మాత్రంగా చెప్పింది. కాగా కాగితంపై అది భిన్నమైన కథ. చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం ఈ విధంగా కొనసాగించటం సాధ్యం కాదు. దీన్ని సరిదిద్దకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రూపాయి విలువ తగ్గుతూ ఉండటానికి సిఎడి విస్తరణే ప్రధాన కారణమనేది స్పష్టం. గత ఆర్థిక సంవత్సరానికి సిఎడి జిడిపిలో 1.9 శాతానికి విస్తరించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. అది 201617లో 0.6 శాతం మాత్రమే. కరెంట్ అక్కౌంట్ అనేది దేశంలోకి విదేశీ కరెన్సీల రాకపోక మధ్యనున్న నికర వ్యత్యాసం. సేవల నుంచి నికర ఆర్జనలో, ప్రైవేటు బదిలీ జమల్లో పెరుగుదల లేనట్లయితే 201718లో భారతదేశ కరెంట్ అక్కౌంట్ లోటు మరింత పెరిగి ఉండేదని ఆర్‌బిఐ పేర్కొన్నది. భారత్‌లోని స్థూల ఎఫ్‌డిఐ 2016 17 లోని 60.2 బిలియన్ డాలర్ల నుంచి 201718 లో 61 బిలియన్ డాలర్లకు మాత్ర మే పెరిగింది. కాగా నికర ఎఫ్‌డిఐ ఆగమనం 2016 17లోని 35.6 బిలియన్ డాలర్ల నుంచి 2017 18లో 30.3 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ నికర ఆగమనం 201617లోని 7.6 బిలియన్ డాలర్ల నుంచి 201718లో 22.1 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆర్‌బిఐ తెలిపింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2017 18లో 43.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. సేవల నుండి నికర ఆర్జన పెరుగుదల , ప్రైవేటు బదిలీ జమల్లో వృద్ధి గత సంవత్సరం రూపాయి విలువ ఎక్కువగా దిగజారకుండా నిరోధించి ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు రూపాయి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ ధోరణి కనీసం వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగవచ్చు.
కరెన్సీ విలువ తిరోగమన లక్షణం ఆర్థిక వ్యవస్థ స్థితితో ముడిపడి ఉన్నందున భారత వృద్ధిరేటు పెరుగుదల గూర్చి, సామాన్య ప్రజలపై దాని ప్రభావం గూర్చి అత్యుత్సాహానికి అవకాశం లేదు. జాతీయ కరెన్సీ విలువ 12 శాతం పైగా తగ్గుదలకు, దేశ జిడిపి 7 శాతంపైగా వృద్ధికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, కొద్ది రోజుల క్రితం రాజీనామా సమర్పించిన ప్రభుత్వ ముఖ్యఆర్థికసలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వంటి భారత్‌కు చెందిన సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు మాత్రమే దాన్ని వివరించగలరు. ప్రభుత్వ ఆర్థిక యాజమాన్య తీరుపట్ల రాజన్ సంతృప్తికరంగా లేరు. అనేక మంది బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులతో ఆయ న రాజీపడలేకపోయారు. ఆర్థిక విధానాలను తరచూ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై సుబ్రమణియన్ అభిప్రాయాలు ఇంకనూ బహిరంగం కాలేదు. భారత దేశ సిఎడి ఆకస్మికంగా 42 శాతం పెరగటం పట్ల ఆయన సంతోషంగా ఉండి ఉండరు. సిఎడి పెరుగుదలకు ఆయిలు దిగుమతి రేటు పెరగటం ఒక్కటే కారణం కాదని ఆయనకు తెలుసు. ఆయిలు దిగుమతులకు నికర చెల్లింపులు 2017 18లో 71 బిలియన్ డాలర్లు. అది అంతకుముందు సంవత్సరం 55 బిలియన్ డాలర్లు. కాగా ఆయిలుయేతర దిగుమతులు 18 శాతం పెరిగాయి. బంగారం కొనుగోళ్లలో పెరుగుదల కూడా దిగుమతి బిల్లు పెరుగుదలకు కారణభూతమవుతోంది.
బంగారం దిగుమతికి విదేశీ మారక ద్రవ్యం నికర చెల్లింపు 22 శాతం పెరిగింది. మార్కెట్‌లో ఎటువంటి భయోత్పాతం ఏర్పడకుండా నిరోధించే నిమిత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఒక స్థాయిలో ఉంచేందుకుగాను రిజర్వు బ్యాంక్ మార్కెట్ నుంచి అమెరికన్ డాలర్లను రెగ్యులర్‌గా కొంటున్నది. అటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే రూపాయి విలువ ఇప్పటికే మరింతగా తరిగి ఉండేది. అమెరికన్ డాలర్‌తో మారక విలువలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న 10 ప్రపంచ కరెన్సీల్లో కొన్ని : కువైట్ దినార్, బహ్రైన్ దినార్, ఒమన్ రియాల్, బ్రిటిష్ పౌం డ్, యూరో, స్విస్ ఫ్రాంక్. బ్రిటిష్ పౌండ్ విలు వ గత సంవత్సరంనుంచి 17 శాతం తరిగింది.

  *  నంటూ బెనర్జీ