Friday, March 29, 2024

ప్రకృతి విపత్తులతో 87 బిలయన్ డాలర్లు నష్టపోయిన భారత్!

- Advertisement -
- Advertisement -

Climate change

స్విట్జర్లాండ్: తుఫానులు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా ఏడాది(2020)లో 87 బిలియన్ డాలర్లు భారత్ నష్టపోయిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్లుఎంఒ) మంగళవారం తన నివేదికలో పేర్కొంది. విశేషమేమిటంటే స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో కాప్26 పేరిట వాతావరణ మార్పుపై అంతర్జాతీయ సమావేశం జరుగనున్న తరుణంలో ఈ నివేదిక వెలువడింది. సంవత్సర సగటు నష్టం(ఎఎఎల్) నివేదికను ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్(ఇఎస్‌సిఎపి) రూపొందించిందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.

ప్రకృతి విపత్తుల కారణంగా ఎక్కువ నష్టపోయిన దేశం చైనా. ఆ దేశం సంవత్సరకాలంలో 238 బిలయన్ సంపదను నష్టపోయింది. ఆ తర్వాత భారత్ 87 బిలియన్ డాలర్ల నష్టంతో రెండో స్థానంలో ఉంది. వాతావరణ మార్పు విషయానికి వస్తే వేడి తీవ్రత బాగా పెరిగిపోయిందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.

AAA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News