Friday, April 26, 2024

రాయుడు ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది: సురేశ్ రైనా

- Advertisement -
- Advertisement -

India not having proper no 4 for WC 2019: Raina

ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అంబటి రాయుడు ఆడి ఉంటే టీమిండియా కచ్చితంగా ట్రోఫీని గెలుచుకునేదని మాజీ ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో రైనా ఈ విషయం చెప్పాడు. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌కు జట్టును ఎంపిక చేయడంలో అప్పటి సెలెక్టర్లు తీవ్ర పక్షపాతానికి పాల్పడ్డారని రైనా ఆరోపించాడు. నాలుగో స్థానంలో నిలకడగా ఆడే రాయుడును పక్కనబెట్టి చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ పెద్ద తప్పిదమే చేశాడన్నాడు. ఒకవేళ రాయుడు జట్టులో ఉండి ఉంటే సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు గెలుపు అవకాశలు చాలా మెరుగ్గా ఉండేవన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే కచ్చితంగా టీమిండియా ప్రపంచకప్ ట్రోఫీ సాధించేదని రైనా జోస్యం చెప్పాడు. కానీ రాయుడు స్థానంలో ఏమాత్రం అనుభవం లేని విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం ద్వారా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదన్నాడు.

India not having proper no 4 for WC 2019: Raina

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News