Home జాతీయ వార్తలు ఆకలి సూచీలో భారత్‌కు 94వ స్థానం.. రాహుల్ ఫైర్

ఆకలి సూచీలో భారత్‌కు 94వ స్థానం.. రాహుల్ ఫైర్

India ranks 94th on Global Hunger Index

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఆకలి సూచీ- 2020 నివేదికలో భారతదేశం 94వ స్థానంలో నిలవడంపై రాహుల్ ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తమ ప్రత్యేక ‘స్నేహితుల’ జేబులను నింపుతోందని, అందకే దేశంలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని విమర్శించారు. 107దేశాలకు గాను భారత్ 94వ స్థానంలో ఉండగా… పాకిస్తాన్(88), నేపాల్(73), బంగ్లాదేశ్ (75)దేశాలు మన దేశం కన్నా మెరుగైన ర్యాంకుల్లో ఉన్నాయంటూ గ్రాఫ్ ను ట్వీట్టర్ ద్వారా పోస్టు చేశారు. కాగా, చైనా, టర్కీ, క్యూబా, కువైట్ సహా 17దేశాలకు సంయుక్తంగా మొదటి స్థానం దక్కింది.