Home జాతీయ వార్తలు 1,15,736 కొత్త కేసులు

1,15,736 కొత్త కేసులు

India records 115736 new cases in yet highest

 

24 గంటల్లో 630 మంది మృతి
8 లక్షలు మించిన క్రియాశీల కేసులు

న్యూఢిల్లీ : గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,15,736 కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. గత మూడు రోజుల్లో ఒకే రోజులో లక్షను మించి కేసులు రెండోసారి నమోదు కావడం విశేషం. అలాగే తాజాగా 630 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,66,177 కు చేరింది. క్రియాశీల కేసులు మొత్తం 8,43,473కు చేరు కున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 6.59 శాతంగా నమోదైంది. కోలుకున్న వారి సంఖ్య 1,17, 92,135కు చేరడంతో మరణాల రేటు 1.30 శాతానికి తగ్గింది. మంగళవారం 12,08,339 నమూనాలు పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 25,14,39,598కు చేరిందని ఐసిఎంఆర్ వెల్లడించింది.

వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు
వ్యాక్సినేషన్‌లో అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ చేపడుతున్న దేశంగా భారత్ రికార్డు సాధిం చింది. రోజువారీ సరాసరి 30,93,861 డోసులు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. ఇప్పటివరకు 8,70,77,474 మందికి 13,32,130 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందించడమైంది. అరవై ఏళ్లు పై బడిన వారిలో 3,53,75,953 మందికి మొదటి డోసు, 10,00,787 మందికి రెండో డోసు అందించారు. అలాగే 45 నుంచి అరవై ఏళ్ల వారిలో 2,18,60,709 మందికి మొదటి డోసు, 4,31,933 మందికి రెండో డోసు అందించారు. గత 24 గంటల్లో 33 లక్షల కన్నా ఎక్కువ డోసులు అందించారు.

త్రిపుర సిఎం బిప్లబ్ దేవ్‌కు పాజిటివ్
అగర్తలా : త్రిపుర ముఖ్య మంత్రి బిప్లబ్ కుమార్ దేవ్‌కు బుధవారం కరోనా పాజిటివ్ సోకింది. దీంతో స్వయం ఐసొలేషన్‌తో ఆయన ఇంటికే పరిమితమ య్యారు. డాక్టర్ల సలహా మేరకు తాను ఐసొలేషన్ పాటిస్తున్నానని, ప్రతివారు కరోనా నిబంధనలు పాటించి భద్రంగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. దేవ్ నమూనాలను బుధవారం రాపిడ్ యాం టిజెన్ పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ కనిపిం చిందని పశ్చిమ త్రిపుర జిల్లా వైద్యాధికారి డాక్టర్ సంగీత చక్రవర్తి చెప్పారు. దేవ్ కుటుంబీకులు ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ కనిపించింది.