న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నిరోజులుగా 40 వేలకు పైగా నమోదవుతుండగా, ఇవాళ 38 వేల మంది కొవిడ్-19 బారినపడ్డాగా.. దేశంలో మొత్తం కరనా కేసు సంఖ్య 94 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 38,772 కొత్త కోవిడ్-19 కేసులు, 443 మంది మరణించారు. అదే సమయంలో 45,333 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,31,692కి చేరింది. ఇండియాలో ఇప్పటివరకు 1,37,139 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,46,952 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో కరోనా మహమ్మారి నుంచి 88,47,600 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 8,76,173 నమూనాలను పరీక్షించించగా.. మొత్తం నమూనాల సంఖ్య 14,03,79,976 కు చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.