Home జాతీయ వార్తలు భారత్‌లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు

India records 8392 Covid-19 cases in 24 hours

 

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కోవిడ్ 19 కేసుల సంఖ్య వరుసగా పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలను మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 230 మంది రోగులు మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు.

దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1,90,322 కేసులు కాగా, 5,394 మంది రోగులు మృతిచెందారని తెలిపారు. ఇప్పటివరకు కరోనా యాక్టివ్ కేసులు 93,322 ఉండగా, మరో 91,819 మంది రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు.  అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ ఏడోవ స్థానంలో ఉన్నది.

India records 8392 Covid-19 cases in 24 hours