Home జాతీయ వార్తలు 3,68,147 కేసులు

3,68,147 కేసులు

India registers 368147 new cases and 3417 deaths

 

3,417 మరణాలు, డెత్‌రేట్ 1.10 శాతం
10 రాష్ట్రాల్లోనే 73 శాతం కేసులు

న్యూఢిల్లీ: దేశంలో సోమవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 3,68,147,మరణాలు 3417 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,99,25,604కు, మొత్తం మరణాల సంఖ్య 2,18,959కి చేరింది. 24 గంటల్లో 3,00,732 మంది రికవర్ కాగా, కోలుకున్నవారి సంఖ్య1,62,93,003కి చేరింది. దీంతో, రికవరీ రేట్ 81.77 శాతంగా, మరణాల రేట్ 1.10 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 34,13,642గా నమోదైంది. మొత్తం కేసుల్లో ఇది 17.13 శాతం అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసుల్లో 73.78 శాతం పది రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 56,647, కర్నాటకలో 37,733, కేరళలో 31,959 కేసులు నమోదయ్యాయి.

వీటితోపాటు ఆ పది రాష్ట్రాల్లో తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ ఉన్నాయి. ఆదివారం 15,04,698 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 29,16,47,037కు చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. 24 గంటల్లో దేశంలో 3417 మరణాలు నమోదు కాగా, అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 669, ఢిల్లీలో 407,ఉత్తర్‌ప్రదేశ్‌లో 288,కర్నాటకలో 217, చత్తీస్‌గఢ్‌లో199,రాజస్థాన్‌లో 159, పంజాబ్‌లో157, గుజరాత్‌లో,తమిళనాడులో 153 చొప్పున, హర్యానాలో 145, జార్ఖండ్‌లో 115 నమోదయ్యాయి. నూతన మరణాల్లో 74.54 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.

11 కోట్ల కొవిషీల్డ్, 5 కోట్ల కొవాగ్జిన్, మూడు నెలల్లో వస్తాయి : కేంద్రం
11 కోట్ల కొవిషీల్డ్, 5 కోట్ల కొవాగ్జిన్ డోసులు మూడు నెలల్లో అందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 11 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కి రూ.1732.50 కోట్ల అడ్వాన్స్‌ను ఏప్రిల్ 28న విడుదల చేశామని తెలిపింది. ఆదాయం పన్ను పోగా, వారికి రూ.1699.50 కోట్లు అందాయని పేర్కొన్నది. ఆర్డర్ ఇచ్చిన ఈ వ్యాక్సిన్లు మే, జూన్, జులై నెలల్లో అందుతాయని తెలిపింది. గతంలో ఆర్డర్ ఇచ్చిన పది కోట్ల కొవిషీల్డ్ డోసుల్లో 8.744 కోట్ల డోసులు మే 3 వరకు అందాయని తెలిపింది. కొత్తగా వ్యాక్సిన్ల కోసం కేంద్రం ఆర్డర్లు ఏమీ ఇవ్వలేదన్న వార్తల్లో నిజం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.

భారత్ బయోటెక్‌కు కూడా కొవాగ్జిన్ ఐదు కోట్ల డోసుల కోసం ఏప్రిల్ 28న రూ.787.50 కోట్లు విడుదల చేయగా, పన్నులు పోగా రూ.772.50 కోట్లు వారికి అందాయని తెలిపింది. అవి కూడా మే,జూన్,జులై నెలల్లో వస్తాయని తెలిపింది. గతంలో రెండు కోట్ల డోసులకు ఆర్డర్ ఇవ్వగా, మే 3 వరకు 0.8813 కోట్ల డోసులు అందాయని తెలిపింది. మే 2 వరకల్లా రాష్ట్రాలు, యుటిలకు 16.54 కోట్ల టీకాలు పంపామని, వాటిలో ఇంకా 78 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నది. మరో 56 లక్షల డోసులు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

18 ఏళ్ల పైబడిన వారికి ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రారంభం
మూడోదశలో ఢిల్లీలో 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఈ దశలో వ్యాక్సినేషన్ కోసం ఢిల్లీలోని 76పాఠశాలల్లో 301 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఉపముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా తెలిపారు. 300 పాఠశాలల్లో 3000 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది తమ లక్షమని ఆయన తెలిపారు. మూడో దశలో టీకాలకు ఢిల్లీలో దాదాపు 90 లక్షలమంది అర్హులున్నారు. వ్యాక్సినేషన్ కోసం ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 1.34 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. అవి మూడు నెలల్లో పూర్తిగా వస్తాయని అంచనా. వీటిలో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు 67 లక్షల డోసులున్నాయి. మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే వెల్లడించారు.

India registers 368147 new cases and 3417 deaths