Thursday, April 25, 2024

చైనా వక్ర చేష్టలొద్దు: భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనా కుయుక్తులు మానుకుని, సవ్యంగా వ్యవహరిస్తే మంచిదని భారతదేశం హెచ్చరించింది. ఐరాస భద్రతా మండలిలో చైనా మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు యత్నించడంపై నిరసన తెలిపింది. దేశ అంతర్గత వ్యవహారాలలో కలుగచేసుకునే వక్రబుద్ధి మానాలని, సరైన విధంగా వ్యవహరించాలని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. భద్రతా మండలిలో కశ్మీర్ అంశం ప్రస్తావించేందుకు పాకిస్థాన్ బుధవారం తీర్మానం తీసుకువచ్చే దౌత్య యత్నానికి దిగింది. దీనికి చైనా మద్దతు ప్రకటించింది. జమ్మూకశ్మీర్ పునర్వస్థీకరణ, ఆర్టికల్ 370 రద్దు జరిగి ఏడాది అయిన దశలో భద్రతా మండలిలో పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు యత్నించింది.

పాకిస్థాన్, చైనాలు చేసిన యత్నాలు ఫలించలేదని, ఇకనైనా చైనా సరైన విధంగా వ్యవహరించడం మంచిదని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది. ఇంతకు ముందు కూడా చైనా అనేక సార్లు భారతదేశ అంతర్గత విషయాలపై మాట్లాడేందుకు అంతర్జాతీయ వేదికల నుంచి యత్నించిందని, ఇంతకు ముందటి లాగానే ఇప్పుడూ చైనాకు చుక్కెదురు అయిందని భారతదేశం తెలిపింది.

India rejects China move on Kashmir issue at UNSC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News