Saturday, April 20, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Report 6915 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల బాగా కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 6 వేలకు దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,915 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనాతో మరో 180 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4.29కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య 5,14,023కు చేరుకుంది. గత 24 గంటల్లో 16,864 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 4.23కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 92,472 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, క్రియావీల కేసుల రేటు 0.22 శాతానికి క్షీణించగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతం దిగువకు తగ్గింది. ఇక రికవరీ రేటు 98.59శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 177.50కోట్లు దాటినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Report 6915 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News