Saturday, April 20, 2024

దేశంలో 1892 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ దేశం లోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడంతో ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 1892 కి చేరింది. ఇప్పటివరకు 766 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఒమిక్రాన్ కేసులు గరిష్ఠంగా మహారాష్ట్రలో 568 వరకు నమోదయ్యాయి. ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 152,తమిళనాడులో 121 వరకు కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కొవిడ్ కేసులు తాజాగా 37,379 బయటపడడంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3,49,60,261కి చేరింది.యాక్టివ్ కేసులు 1,71,830 గా నమోదయ్యాయి. తాజాగా 124 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 4,82,017 కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.49 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.13 శాతంగా కొనసాగుతోంది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,43,06,414 వరకు ఉంది. ఇంతవరకు దేశంలో 146.70 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

India Reports 1892 Omicron Cases So Far

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News