Home జాతీయ వార్తలు దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది

India reports 2,68,833 new covid-19 cases

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,68,833 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతంకు చేరుకుంది. శుక్రవారం 16.13 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు కేసులు నమోదైన్నాయి. ప్రస్తుతం దేశంలో 14,17,820 కేసులు చేరింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041కు చేరుకుంది. ఇక, 24 గంటల్లో కరోనా నుంచి 1,22,684 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్తో కరోనాతో 402 మంది మృతి చెందగా.. మొత్తంగా 4.85 లక్షల మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కోనసాగుతుంది. శుక్రవారం 57.37 లక్షల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. 3.92 లక్షల మంది ప్రికాషన్ డోసు పోందారు. ఇప్పటివరకు మొత్తం 156.02 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India reports 2,68,833 new covid-19 cases