Home తాజా వార్తలు ఇంధన ఒప్పంద హామీలను గౌరవిస్తాం

ఇంధన ఒప్పంద హామీలను గౌరవిస్తాం

Fuel contract Guarantees

 

పెట్టుబడిదారులు ఆందోళన చెందొద్దు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల

న్యూఢిల్లీ : ఇంధన ఒప్పంద హామీలను భారతదేశం గౌరవిస్తుందని, ముఖ్యంగా పునరుత్పాదక రంగంలో పెట్టుబడిదారులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఒప్పంద హామీలను గౌరవించడంపై ఆందోళనలను హైలైట్ చేయాలనుకుంటున్నానని, ఇంధన, ఇంధన భద్రత కోసం భారత్ పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియా ఎనర్జీ ఫోరం ఆఫ్ సెరావీక్‌లో ఆమె అన్నారు. అనిశ్చితి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నామని తెలుసని, అయితే ఇది అర్థమయ్యేది కాదని అన్నారు. హామీలను గౌరవిస్తామని, అందువల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ప్రభుత్వం నోడల్ ఏజెన్సీలైన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇసిఐ), ఎన్‌టిపిసిలను విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పిపిఎ) కింద వేలం వేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల సుంకాన్ని తగ్గించాలని కోరింది. దీని వల్ల ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడిదారుల మనోభావాలు ప్రభావితమయ్యాయి. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని కలిగి ఉండాలని భారతదేశం లక్ష్యాన్ని నిర్దేశించింది. అందువల్ల వచ్చే మూడేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశానికి భారీ పెట్టుబడులు అవసరం. పెట్టుబడు లు పెట్టడానికి వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఇటువంటి సంఘటనలు (ఆంధ్రప్రదేశ్ మాదిరిగా) మరలా జరగకుం డా చూసుకోవాలని నిర్మల సీతారామన్ అభిప్రాయపడ్డారు.

India respects Fuel contract Guarantees