Home తాజా వార్తలు భారత్ ఘన విజయం

భారత్ ఘన విజయం

India revive series with 203-run win over england

సమష్టిగా రాణించిన బ్యాట్స్‌మెన్, బౌలర్లు                                                                                                              మూడో టెస్టులో 203  పరుగులతో ఇంగ్లండ్‌పై గెలుపు                                                                                                మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా విరాట్ కోహ్లి

నాటింగ్‌హామ్: భారత క్రికెటర్లు నమ్మశక్యంగాని పర్‌ఫార్మెన్స్‌తో మూడో టెస్టును 203 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టును చిత్తు చేశారు. విజయానికి చివరి ఐదో రోజున కేవలం ఒకే ఒక్క వికెట్ తీయాల్సి ఉండగా 2.5 ఓవర్లలోనే దానిని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ జట్టు 317 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 521 లక్ష ఛేదనలో విఫలమైంది. ఇప్పుడు భారత్ 12 తేడాతో సిరీస్‌లో వెనుకబడి ఉంది. ఎడ్గ్‌బాస్టన్, తర్వాత లార్డ్ ఓటముల నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంది. ఇంగ్లాండ్ చివరి వికెట్‌ను రవిచంద్రన్ అశిన్ తీశాడు. అతడు వేసిన బంతికి జేమ్స్ ఆండర్సన్(11) అజింక్యా రహానె చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు.

జట్టు ఆల్‌రౌండ్ పర్‌ఫార్మెన్స్
విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఉపఖండం వెలుపల భారత జట్టు పూర్తి పర్‌ఫార్మెన్స్‌ను చూయించి రాణించింది. ఓపెనర్లు కె.ఎల్. రాహుల్, శిఖర్ ధవన్ ఆకట్టు విధంగా కాకపోయినప్పటికీ గట్టిగా నిలబడి ఆడారు. బౌలర్లు ఇషాంత్ శర్మ( 2/32, 2/70), మహ్మద్ షమీ 1/56, 1/78) బాగా దాడిచేశారనే చెప్పాలి. వైస్‌కెప్టెన్ అజింక్యా రహానె( తొలి ఇన్నింగ్స్‌లో 81), టెస్ట్ స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారా(రెండో ఇన్నింగ్స్‌లో 72) చేయడం విజయంలో కీలకమయ్యాయి. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా రాణించాడు. వికెట్లు, పరుగులు రెండింటిలో మెరుగైన పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. అతడి పర్‌ఫార్మెన్స్‌పై విమర్శలు చేసిన వారికి దీటుగా జవాబిచ్చాడు. రాహుల్ ఎగిరి దుముకి స్లిప్ కాచ్‌లు పట్టుకోడం చెప్పుకోదగిన విషయం. మొత్తం ఏడు క్యాచ్‌లు పట్టుకున్నాడు. రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకుని తన సత్తా చూయించాడు. వృద్ధిమాన్ షా ఫిట్ అయ్యాక టీమ్‌లో రాగలడని భావిస్తున్నారు.

బ్యాట్స్‌మన్‌గా రాణించిన కోహ్లి
విరాట్ కోహ్లి మూడో టెస్టులో 97, 103 పరుగులు చేసి తన ట్యాలీని 440 పరుగులకు చేర్చాడు. బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తనను తాను నిరూపించుకున్నాడు. విచిత్రమేమిటంటే తొలి టెస్టులోనూ, మూడో టెస్టులోనూ విరాట్ కోహ్లి సరిగ్గా 200 పరుగులు చేశాడు. రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు చేసినందున ప్రస్తుతం ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్‌లలో విరాట్ సత్తాపై చర్చ అనవసరం అనే చెప్పాలి. అతడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లపై శతకాలు బాదేశాడు. ఇంగ్లాండ్ జట్టులోని జానీ బెయిర్‌స్టో(206 పరుగులు), జోస్ బట్లర్ తన తొలి టెస్ట్ శత
కంతో పాటు 170 పరుగులతో అత్యధిక స్కోరు చేసి బ్యాట్స్‌మన్‌లలో రెండో మూడో స్థానాల్లో ఉన్నారు. కాగా భారత్ జట్టు నుంచి పాండ్య 160 పరుగులు చేసి రెండో ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పటికీ మొదటి రెండు టెస్టుల్లో అతడి బ్యాటింగ్ బాగుండకపోవడం వల్ల చర్చనీయాంశంగా మారింది.

కేరళ బాధితులకు అంకితం
నాటింగ్ హామ్ టెస్టులో భారత్ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో గెలిచి కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలని జట్టు సభ్యులమంతా నిర్ణయించుకున్నామని, అందుకనుగుణంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి విజయాయనికి చేరుకున్నామని. ఈ గెలుపును కేరళ వరద బాధితులకు అంకితం ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అక్కడ చోటు చేసుకున్న పరిస్థితికి జట్టు సభ్యులుగా మేం చేయవలసిన చిన్న సహాయం ఇది.

లార్డ్స్ టెస్టుల్లోనే చెత్త ప్రదర్శన ఇచ్చాం. ఆ మ్యాచ్‌లో చేసిన తప్పులను వెతుక్కొని వాటిని అధిగమించి, బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు ఫీల్డింగ్‌లో ముఖ్యంగా స్లిప్ క్యాచ్‌లతో పరిణతి సాధించాం. దీంతో విజయం సాధించడానికి సలువైంది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు.’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు రాణించడం ఆనందంగా ఉంది. మేం ఎప్పుడూ మా ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారిస్తాం. ఇదే ఊపుతో సిరీస్ కైవసం చేసుకుంటాం’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.