Tuesday, March 19, 2024

గడగడలాడించే రికార్డు

- Advertisement -
- Advertisement -

ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 28,071 కరోనా కేసులు చోటుచేసుకున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్ రోగుల సంఖ్య ఇప్పుడుసోమవారం 8,78,254కు చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో 500 మంది వైరస్ తీవ్రతతో తట్టుకోలేక మృతి చెందారు. దీనితో ఇప్పుడు ఇండియాలో మరణాల సంఖ్య 23,174కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా తీవ్రత విషయంలో మూడోస్ధానంలో ఉంది. అయితే కోవిడ్ మరణాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలో కరోనా వ్యాప్తి సంబంధిత వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ రోజువారి గణాంకాల ప్రాతిపదికన వెల్లడించింది. ఇప్పటివరకూ వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 5,53,470. అయితే ఇప్పటికీ వైరస్ తీవ్రతతో బాధపడుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 3,01,609గా ఉంది. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే రికవరీ రేటు 63.01గా ఉందని వెల్లడైంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వరుసగా నాలుగు రోజులుగా 26వేలు దాటి రికార్డు అవుతోంది. ఇక పరీక్షల విషయానికి వస్తే ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 1,18,06,256 మంది శాంపుల్స్ టెస్టులు జరిగాయి. ఈ విషయాన్ని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్ ) తెలిపింది. ఆదివారం ఒక్కరోజే రెండులక్షల మందికి పైగా టెస్టులు జరిగాయి. , ఒక్కరోజు సంభవించిన 500 మరణాలలో అత్యధికంగా 173 మంది మహారాష్ట్రలో, తరువాతి స్థానంలో 7 మంది కర్నాటకలో మృతి చెందారు. తమిళనాడులో 68 మంది, ఢిల్లీలో 37 మంది, పశ్చిమబెంగాల్‌లో 26 మంది, ఉత్తరప్రదేశ్‌లో 21 మంది,ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది, గుజరాత్‌లో 13 మంది మృతి చెందారు. బీహార్‌లో 12, జమ్మూ కశ్మీర్‌లో పది మంది , మధ్యప్రదేశ్‌లో తొమ్మిది మంది, తెలంగాణలో ఎనిమిది మంది, రాజస్థాన్, జార్ఖండ్‌లలోఏడుగురు చొప్పున కరోనాతో చనిపోయ్యారు. హర్యానా, పంజాబ్‌లలో నలుగురు చొప్పున మృతి చెందగా , ఒడిషాలో ముగ్గురు మృతి చెందారు. కేరళ, గోవా, చత్తీస్‌గఢ్‌లలో ఇద్దరు చొప్పున కన్నుమూశారని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలిపారు.

మొత్తం మరణాలు రాష్ట్రాలవారిగా
మహారాష్ట్ర అత్యధికంగా 10,289
ఢిల్లీ …..3371, గుజరాత్ 1966
ఉత్తరప్రదేశ్ 934, పశ్చిమ బెంగాల్ 932, మధ్యప్రదేశ్ 653, కర్నాటక 684, రాజస్థాన్ 510

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 2,30,370 మందికి కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,30,370 మందికి వైరస్ సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వెలువరించింది. గత కొద్ది రోజులుగా రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నెల పదవ తేదీన ఒక్కరోజే 2,28,102 మందికి వైరస్ సోకింది. ఇది రికార్డుగా నిలిచింది. అయితే ఈ రికార్డును దాటుతూ ప్రస్తుత కరోనా రోగుల సంఖ్య చేరుకుంది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 5వేల మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజువారి లెక్కలో అత్యధిక కేసులు అమెరికా, బ్రెజిల్ తరువాత భారత్, దక్షిణాఫ్రికాలలో నమోదు అవుతూ వస్తున్నాయి. అమెరికాలో అత్యధికంగా ఒక్కరోజే దాడాపు 67వేల మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోటి 30 లక్షల మందికి కరోనా వైరస్ వచ్చింది. మొత్తం మీద 5 లక్షల 68వేల మంది బలి అయ్యారు.

India seen 28071 record corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News