Home జాతీయ వార్తలు ఒక్కరోజులో లక్షకుపైగా రికవరీలు..

ఒక్కరోజులో లక్షకుపైగా రికవరీలు..

ఒక్కరోజులో లక్షకుపైగా రికవరీలు
ఇప్పటివరకూ కోలుకున్నది 45 లక్షలు
రికవరీ రేట్ 80.86 శాతం

న్యూఢిల్లీ: దేశంలోని కొవిడ్19 బాధితులు ఒక్క రోజులోనే 1,01,468మంది కోలుకున్నారు. దీంతో, రికవరీల సంఖ్య 44,97,867కు, రికవరీల రేట్ 80.86 శాతానికి చేరుకున్నది. వీరిలో 79 శాతంమంది 9 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినవారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్క రోజులో మహారాష్ట్రలో 32,000(31.5)కుపైగా, ఆంధ్రప్రదేశ్‌లో 10,000కు పైగా కోలుకున్నారు. వరుసగా నాలుగు రోజులపాటు కోత్తగా నమోదయ్యే కేసులకన్నా రికవరీలు అధికంగా నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. టెస్ట్(పరీక్షించడం), ట్రాక్(గుర్తించడం), ట్రీట్(చికిత్స అందించడం) అన్న సూత్రంతో పని చేయడం వల్లే రికవరీ రేట్‌ను పెంచగలిగామని ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటలవరకల్లా 24 గంటల్లో కరోనా కేసులు 75,083, మరణాలు 1053 నమోదయ్యాయి. దీంతో, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 55,62,663కు, మరణాల సంఖ్య 88,935కు చేరుకున్నాయి. మరణాల రేట్ 1.59గా నమోదైంది.

India sees 1 lakh recoveries in 24 hrs