Home తాజా వార్తలు భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు

భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు

India
స్వదేశంలో వరస టెస్టు సిరీస్ విజయాల్లో
ఆసీస్ రికార్డు బద్దలు
పుణె: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించింది. ఇప్పటివరకు టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియాను సైతం వెనక్కి నెట్టింది. స్వదేశంలో వరస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్ర స్థానానికి ఎగబాకింది. సఫారీలతో టెస్టు సిరీస్‌ను సాధించడంతో భారత్‌కు ఇది వరసగా 11వ టెస్టు సిరీస్ విజయం. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది.199495 సిరీస్ మొదలుకొని 200001 సిరీస్ వరకు ఆస్ట్రేలియా తమ దేశంలో వరసగా సాధించిన టెస్టు విజయాల సంఖ్య పది. ఆ తర్వాత ఆస్ట్రేలియా మరోసారి 200409 సిరీస్ మధ్య వరసగా పది స్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే ఆసీస్ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా తాజాగా బ్రేక్ చేసింది. 201213 సీజన్ మొదలుకొని ఇప్పటివరకు భారత్ వరసగా 11 స్వదేశీటెస్టు సిరీస్ విజయాలను నమోదు చేసింది.

తద్వారా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ జాబితాలో టీమిండియా, ఆసీస్‌ల తర్వాతి స్థానంలో వెస్టిండీస్ ఉంది. 197576 సీజన్ మొదలుకొని 198586 సీజన్ వరకు వెస్టిండీస్ తన సొంతగడ్డపై వరసగా 8 టెస్టు సిరీస్‌లలో విజయం సాధించింది. కాగా ఇన్నింగ్స్ పరుగుల తేడాతో విజయం సాధించడం కోహ్లీకి ఇది 8వ సారి. ధోనీ 9 సార్లు ఇలా విజయం సాధించాడు. కాగా కెప్టెన్‌గా జట్టుకు అత్యధిక విజయాలు అందించిన వారిలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 50 టెస్టులకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ 30 విజయాలు అందించాడు. కోహ్లీకంటే ముందు స్టీవ్‌వా (37), రికీ పాంటింగ్ (35) ఉన్నారు. కాగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు ఈ నెల 19నుంచి రాంచీలో ప్రాంభమవుతుంది.

India Set New World Record With Test Series Win