Home జాతీయ వార్తలు పాక్‌పై యుద్ధం ప్రకటించి..భారత్‌లో కలుపుకోవాలి : జెసి

పాక్‌పై యుద్ధం ప్రకటించి..భారత్‌లో కలుపుకోవాలి : జెసి

Jc-Diwakar-Reddyఅనంతపురం : యురి సెక్టార్‌లో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో సైనికులు మృతి చెందడంపై అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి.. అఖండ భారతావనిలో కలుపుకోవాలన్నారు. స్వాతంత్య్ర సమయంలో మన పెద్దలు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచకోకపోవడం వలనే నేడు ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. మన ఆర్మీ కోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని జెసి అన్నారు. ఇదే ఖర్చ మనం జలవనరుల కోసం ఖర్చు చేసి ఉంటే దేశంలో ప్రతి అంగుళంలోనూ పాడి పంటలు ఉండేవన్నారు.