Tuesday, January 31, 2023

తల్లిపాల దేశంగా తయారవాలి

మనదేశం తల్లిపాల దేశంగా నిలవాల్సింది. కాని పరిస్థితి చూస్తే అలా లేదు. మొత్తం 2,60,000,00  మంది పసిబిడ్డల్లో 1,20,000,00 మందికి అంటే 44 శాతం మందికి పుట్టిన గంటలోగా తల్లిపాలు అందట్లేదు. ఈవిషయాన్ని జాతీయ సమాచార మూలాలు చెప్తున్నాయి. 

- Advertisement -

Mother-Milkకొత్తగా తల్లి అయిన యువతులకు, తల్లిపాల గురించి మద్దతునిచ్చే ఆరోగ్యసేవలు ఏమేరకు అందుతున్నాయో తెలుసుకోడానికి 29 వేలమంది సభ్యులతో ఉన్న ఒక ఫేస్‌బుక్ గ్రూప్ సర్వే నిర్వహించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో జన్మనిచ్చిన 950 మందితో మాట్లాడితే అందులో మూడింట రెండొంతులమంది తమ పిల్లలకు జన్మనిచ్చిన గంటలోగా కృత్రిమ పాలు పట్టామని చెప్పారు. పైగా అలా పట్టడం కూడా వారి అనుమతి తీసుకోకుండా వారి బిడ్డలకు పైపాలు పట్టారని చెప్పారు. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే, ఆరోగ్య కార్యకర్తలకు లేదా ఆమె తరపువారికి, కొత్తగా తల్లయిన యువతులకు పాలు ఉత్పత్తి అవవమని నమ్మకం. దాంతో అప్పుడే తల్లికి పాలు పడవు అనుకుని పోతపాలు పట్టేస్తారు.
అంతా హార్మోన్ల మహిమ : తల్లిపాల పనితీరును హార్మోనులు నియంత్రిస్తాయి. ప్రొక్లెయిన్ అనే హార్మోన్ వలన తల్లిపాలు తయారవుతాయి. అయితే పాల ఉత్పత్తి మాత్రం బిడ్డ తల్లి పాలిండ్ల నుంచి పాలు తాగడం వల్లనే జరుగుతుంది. బిడ్డ ఎంత తాగితే అంతగా పాల సేపు ఉంటుంది. తల్లి పాలిండ్ల నుంచి బిడ్డ నోట్లోకి పాలు వెళ్లడాన్ని ఆక్సిటోసిన్ అనే హార్మోన్ నియంత్రిస్తుంది. అది తల్లి బిడ్డకి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందట. తల్లి సంతోషంగా, ధైర్యంగా ఉన్నప్పుడు మరింత ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది. అదే ఆమె సందేహాలతో, భయంతో, ఉద్విగ్నతతో, నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే ఆక్సిటోసిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే బిడ్డకి మరింతగా పాలు ఉత్పత్తి అవ్వాలంటే తల్లి మూడ్ స్వింగ్స్ కూడా ప్రభావితం చేస్తాయి. బిడ్డ పుట్టిన వెంటనే మమ్మరీ గ్లాండ్లు ఒకరకమైన చిక్కని స్రావాన్ని తయారు చేస్తుంది. దాన్నే మొర్రుబాలు అని కొలోస్ట్రమ్ అని అంటారు. ప్రథమంగా వచ్చే పాలు కాబట్టి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవవు. కాని బిడ్డకి కావలసిన పోషకాలను మాత్రం పుష్కలంగా అందిస్తుంది. కొలోస్ట్రమ్ విడుదల అయ్యే సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా చాలా ఆకలిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పీల్చుకోగలిగిన ఉత్సాహంతో ఉంటుంది. బిడ్డ ఎంత పీల్చితే అంతగా పాల ఉత్పత్తి ఉంటుంది. కాబట్టి మొర్రుబాలు తాగనివ్వకపోతే తర్వాత చనుబాలు ఇవ్వడం కూడా కష్టం అవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి ప్రక్రియను దోచుకోవడానికి ఐదు దశాబ్దాల క్రితం నుంచే ఆహార పరిశ్రమ కుట్రలు మొదలు పెట్టింది. ‘మీరు బిడ్డకు పాలు ఇవ్వలేకపోతున్నారా. మేం మీకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు మా దగ్గర ఉన్నాయి.’ అంటూ ప్రచారాలు మొదలుపెట్టి బిడ్డకి తల్లిపాలు దొరకకుండా చేస్తున్నారు.

మహిళల హక్కుకు అడ్డుగా నిలుస్తున్నాయి : ప్రపంచం మొత్తంలో 90 శాతం మంది మహిళలు ఆహార ఉత్పత్తి కంపెనీల వారి మాటలు నమ్ముతున్నారు. 2016 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్, తల్లిపాలు బిడ్డకి ఇవ్వడానికి కావలసిన రక్షణ, మద్దతు ఇస్తామని ఒక ఉమ్మడి ప్రకటన చేసింది. అందులో, ఏ తల్లులైతే బిడ్డలకు చనుబాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారికి సరైన మద్దతు వ్యవస్థ లేదు. వారి దాకా వెళ్లి ఆరోగ్య సేవలు అందించే సరైన నిర్మాణ వ్యవస్థ లేదు. అది అందించాలని నిర్ణయం తీసుకుంది. తల్లిపాల ప్రత్యామ్నాయాలు మరింతగా మార్కెట్లోకి రావడం, ఆరు నుంచి 36 నెలల పిల్లలకు తల్లిపాలతో పోటీ పడే ఆహారాన్ని అందచేసే ఆహార ఉత్పత్తులు, మహిళల హక్కును పొందడానికి అడ్డుగా నిలుస్తున్నాయి. అటువంటి మార్కెటింగ్ ఆహార ఉత్పత్తులు బిడ్డకి తల్లిపాలను దూరం చేసి బిడ్డ ఆరోగ్యంగా బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి అని కమీషన్ అభిప్రాయ పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఒకసారి బిడ్డకి బయటి పాలు పట్టడం ఆరంభించిన తర్వాత మళ్లీ తల్లిపాలు ఇప్పించడం చాలా కష్టం. ఎందుకంటే బిడ్డ తాగకపోతే తల్లికి పాల ఉత్పత్తి ఆగుతుంది. పైగా పోతపాలకు ఒకసారి అలవాటు పడిన బిడ్డ మళ్లీ చనుబాలు తాగదానికి ఇష్టపడదు. అందువలన తల్లి అనుమతి లేకుండా మార్కెట్లోని పాల డబ్బాలు పట్టడం తల్లి, బిడ్డ ఇద్దరి హక్కును కాలరాసినట్టే అంటోంది.

తల్లికి పాలు రాకపోతే ఏం చేయాలి : తల్లి ఆరోగ్య కార్యకర్తతో తాను బిడ్డకు సరిపడా తల్లిపాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాను అని చెబితే దానికి ప్రత్యామ్నాయం పాల డబ్బానే అని చెప్పకుండా ఎందుకు పాలు పడటంలేదో పరిశోధన చేయాలి. బిడ్డకు పాలు ఇచ్చే టెక్నిక్స్ నేర్పాలి. రక్తహీనతతో లేదా పోషకాహార లోపంతో బాధపడేవారు కూడా బిడ్డకు పాలు ఇవ్వచ్చు. అయితే ఆమెకు సరైన వైద్య మద్దతు ఉండాలి. ఆసుపత్రుల్లో కూడా తల్లిపాల గురించి కౌన్సిలింగ్‌లు జరగాలి. కొలోస్ట్రమ్ నుంచి మొదలుకుని బిడ్డకు పూర్తిగా తల్లిపాలు దొరికేలా చేయగలగాలి.

ప్రభుత్వ పాత్ర ఎలా ఉండాలి : గత 25 ఏళ్ల నుంచి ఒక చట్టం ఉంది. ఆరోగ్య కార్యకర్తలు, వారి సంబంధీకులు కాని బేబీ ఫుడ్ కంపెనీల గురించి ప్రచారం చెయ్యకూడదు. అయినా కాని ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పిల్లల ఆహార ఉత్పత్తి సంస్థలు ప్రచారం ఆపట్లేదు. దానివలన బిడ్డకు తల్లిపాలు దూరం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు అనుసరించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్పుడే పుట్టిన బిడ్డలు, పిల్లల ఆహార ఉత్పత్తి సంస్థల ప్రచారాన్ని ఆపేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles