Wednesday, April 24, 2024

భారత్ రష్యాపై ఆధారపడటం తగ్గించాలి

- Advertisement -
- Advertisement -

 

వాషింగ్టన్: భారతదేశం రష్యాపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. రష్యాను వీడితే భారత్‌తో పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందనితెలిపింది. ఇంధనం, విశ్వసించడం తగదనే యథార్థాన్ని దేశాలు గ్రహించాయని పేర్కొంది. మీడియా సమావేశంలో అమెరికా రాజకీయ సలహాదారు, యూఎస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రష్యాతో సంబంధాలు అమెరికా రష్యాతో కోల్డ్‌వార్ ఉనప్పటి నుంచి కొనసాగుతుంది. దశాబ్దాల గడిచేకొద్దీ ఇరుదేశాల బంధం మరింత బలపడింది. గత 25ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా భద్రత, సైనిక సహకారంతోపాటుప్రతి రంగంలోనూ భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని నెడ్‌ప్రైస్ అన్నారు. భారతదేశం విశాలమైన దేశం, పెద్ద ఆర్థికవ్యవస్థను కలిగి ఉంది.

ఈనేపథ్యంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా పాలనాయంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. గత కొన్ని నెలలుగా భారతదేశంతో అధికసంఖ్యలో ఉన్నతస్థాయి ఒప్పందాలను కుదుర్చుకుందని ప్రైస్ తెలిపారు. రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధించడంతో మాస్కో ఆయిల్, గ్యాస్ ధరలు తగ్గించి భారత్‌కు విక్రయిస్తుందని ప్రైస్ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇంధన డిమాండ్ అధికంగా ఉంది. రష్యా నుంచి కొనుగోలు చేయడం విధించిన ఆంక్షలను అధిగమించడం కాదని భావిస్తోందని ప్రైస్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News