Thursday, April 25, 2024

కరోనాలోనూ స్మార్ట్‌ఫోన్ల జోరు

- Advertisement -
- Advertisement -
India smartphone market record 2021
2021లో రికార్డు స్థాయిలో 16.9 కోట్ల షిప్‌మెంట్

న్యూఢిల్లీ : గత ఏడాది(2021)లో భారతదేశం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అత్యధిక స్థాయిలో 169 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో రికార్డును నెలకొల్పింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం, గత సంవత్సరంలో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ 16.9 కోట్ల యూనిట్లను దాటాయి. అంతకుముందు ఏడాది(2020)లో 15.2 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 11 శాతం ఎక్కువగా ఉంది. కొవిడ్-19 సెకండ్ వేవ్, అలాగే సరఫరా అవరోధాలు, పరికరాల కొరత ఉన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. 5జి స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్ దృష్టా 2021లో స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. 2021లో మొత్తం షిప్‌మెంట్‌లలో 5జి స్మార్ట్‌ఫోన్‌లు 17 శాతం ఉండగా, 2020తో పోలిస్తే ఆరు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.

ఒఇఎంల మధ్య తీవ్రమైన పోటీ నేపథ్యంలో చౌకైన 5జి చిప్‌సెట్‌ల లభ్యత, 5జి పరికరాల ధరలు తగ్గడం వల్ల బ్రాండ్‌లు మరిన్ని 5జి పరికరాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. గత ఆరు నెలల్లో ఎంట్రీ-లెవల్ 5జి పరికరాల ధర 40 శాతం తగ్గింది. 5జి పరికరాల స్థోమత పెరుగుదల అధిక 5జి స్మార్ట్‌ఫోన్ స్వీకరణకు ప్రధాన కారణమైంది. 2021లో ప్రీమియం ధరల శ్రేణి అంటే రూ. 30,000 కంటే ఎక్కువ ధర కల్గిన వాటికి కస్టమర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది, ఈ ప్రైస్ బ్యాండ్‌లలో షిప్‌మెంట్‌లు 98 శాతం పెరిగాయి. 30 శాతం మార్కెట్ వాటా కలిగిన రూ. 10,000 కంటే దిగువన ఉన్న కేటగిరీ 5 శాతం క్షీణించింది. ఇక రూ. 10,000- నుంచి 20,000 విభాగం (47 శాతం వాటా) 8 శాతం పెరిగింది. రూ.20,000- 30,000 విభాగం (13 శాతం) 95 శాతం పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News