Thursday, April 25, 2024

ప్రేక్షకులు లేకుండానే భారత్‌-సౌతాఫ్రికా తొలి టెస్టు

- Advertisement -
- Advertisement -

India-South Africa first Test without spectators

సెంచూరియన్: భారత్‌సౌతాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికాలో కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. ఇలాంటి స్థితిలో ఇరు దేశాల క్రికెటర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఈ మ్యాచ్‌కు అభిమానులను అనుమతించాలని సౌతాఫ్రికా బోర్డు భావించింది. కానీ ఒమిక్రాన్ కలవరం సృష్టిస్తున్న సమయంలో సమస్యలు కొని తెచ్చుకోవాలని తాము భావించడం లేదని సౌతాఫ్రికా బోర్డు అధికారులు పేర్కొన్నారు.

అందుకే తొలి టెస్టు మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నట్టు వివరించింది. దీని కోసం భారత క్రికెట్ బోర్డు సమ్మతి కూడా తీసుకున్నట్టు పేర్కొంది. అభిమానులకు ప్రవేశం కల్పించాలని ఉన్నా క్రికెటర్ల ఆరోగ్య భద్రత దృష్టా ఇలాంటి కఠిన నిర్ణయం తప్పడం లేదని తెలిపింది. ఒమిక్రాన్ భయం నేపథ్యంలో ఒక దశలో అసలు సిరీస్ జరుగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఇటు భారత్, అటు సౌతాఫ్రికా క్రికెటర్లు సిరీస్‌లో ఆడేందుకు అంగీకరించడంతో ఇబ్బందులు తొలగిపోయాయి. సిరీస్‌ను కాస్త ఆలస్యంగా ఆరంభించాలని నిర్ణయించారు. అంతేగాక ముందు అనుకున్నట్టు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించడం లేదు. సిరీస్‌ను వాయిదా వేశారు. అంతేగాక టెస్టుల్లో ఒక మ్యాచ్‌ను తగ్గించారు. ప్రస్తుతం భారత్ ఈ పర్యటనలో మూడు టెస్టులు, మరో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News