Friday, March 29, 2024

సరిహద్దులో పెరిగిన చైనా దళాల కదలికలు

- Advertisement -
- Advertisement -

China
లడఖ్: భారత సరిహద్దుల్లో చైనా దళాల గస్తీ పెరిగిందని తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మంగళవారం తెలిపారు. కేవలం కదలికలే కాక యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయల కల్పనను కూడా చైనా పెంచుకుందని సమాచారం. అయితే భారత్ మాత్రం సరిహద్దు ప్రోటోకాల్కు కట్టుబడి ఉందని, కానీ  అక్కడ ఆ దేశం చేపడుతున్న నిర్మాణాలు తరచూ ఘర్షణలకు దారితీస్తున్నాయని మనోజ్ పాండే తెలిపారు. ఈ నేపథ్యంలో భారత ఈస్టర్న్ కమాండ్ తన సన్నద్ధతను పెంచుకుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో చైనా ట్రూప్‌లతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించారన్నది ఇక్కడ గమనార్హం.
భారత-చైనా సరిహద్దులోని వెస్టర్న్ సెక్టార్‌లో, తూర్పున లడఖ్‌లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. హాట్ స్ప్రింగ్స్‌లోని పెట్రోలింగ్ పాయింట్(పిపి) 15 విషయంలో అక్టోబర్ 10న కమాండర్‌ల స్థాయిలో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. అంతేకాక దెప్సాంగ్ ప్లెయిన్స్ విషయంలో చర్చించడానికి కూడా చైనా నిరాకరించింది. అక్కడ భారత గస్తీ దళాలను చైనా వాళ్లు అడ్డుకుంటున్నారు కూడా.

భారత్ వైపున్న వాస్తవాధీన రేఖ లోపల కొంత మంది చైనా పౌరులు గుడారాలు వేసుకోవడంతో దెంచోక్ ప్రదేశంలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సిక్కీం నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఉన్న 1346 కిమీ. నియంత్రణ రేఖ కాపాడే బాధ్యత ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేపైనే ఉంది. ఇదిలావుండగా సరిహద్దు ప్రాంతాల్లో చైనావారి పిఎల్‌ఎ గస్తీ బాగా పెరిగింది. దీంతో భారత సైన్యం అనేక చర్యలు చేపట్టింది. భారత దళాలు నిఘా విషయంలో డ్రోన్లు, రాడార్లు, కమ్యూనికేషన్లు, రాత్రివేళ చూసే పరికరాలు వినియోగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News