Home స్కోర్ గట్టి పోటీ!

గట్టి పోటీ!

2012ను పునరావృతం చేస్తాం: ఇంగ్లాండ్ కెప్టెన్ అలె స్టెయిర్ కుక్

Virat-vs-englandముంబయి : భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు అండర్‌డా గ్స్‌గా బరిలోకి దిగుతున్నదని క్రీడా కథనాల్లో విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, ఆ జట్టు కెప్టెన్ అలెస్టెయిర్ కుక్ మాత్రం తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఈ సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వబోతున్నామని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ చాలా అవమానాల పాలైంది. ఆఖరి టెస్టులో బంగ్లాదేశ్ కేవలం మూడు రోజుల్లోనే ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిం ది. దీంతో షెడ్యూల్‌కన్నా ముందే కుక్ టీమ్ ఇండియాకు వచ్చేసింది. అయినప్పటికీ నవంబరు 9 నుంచి రాజ్‌కోట్ లో జరిగే తొలి టెస్టుకు గట్టిగా ప్రాక్టీసు చేస్తున్నది. అలెస్టె యిర్ కుక్ కెప్టెన్సీలోనే 2012లో ఇంగ్లాండ్ జట్టు ఇండి యాలో పర్యటించింది. అప్పుడు ఇండియా 1-2 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఇండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానంలో వుంది. అయినప్పటికీ కుక్ పూర్తి నమ్మకంతో వున్నాడు. “ప్రత్యర్థి నెంబర్‌వన్ అయినా నెంబర్ టూ అయినా ప్రతి సిరీస్ కూడా మాకు సవాలే. ఇండియా గడ్డపై ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడటం మాకు ఎప్పుడూ సౌకర్యవంతంగానే వుంటుంది. ఉపఖండంలో మేం ఆడే క్రికెట్ సిరీస్‌లు సహజంగానే తక్కువ. అది మాకు భారీ సవాలే. అయినప్పటికీ ఇండియాతో ఆడటం మాకు చాలా ఇష్టం. రెండేళ్ళుగా మా ఆట బాగుంది. ఈ మధ్య పెద్దగా లేకపోవచ్చు. కానీ పెద్ద సిరీస్‌లలో మంచిగా ఆడాం. గత ఏడాది దక్షిణాఫ్రికా వెళ్లాం. అక్కడ ఆడి గెలిచాం. అప్పుడు దక్షిణాఫ్రికా కూడా నెంబర్‌వన్‌లోనే వుంది” అని కుక్ శనివారంనాడు ప్రాక్టీసు సెషన్ సందర్భంగా మీడియాతో చెప్పాడు. ఇక్కడ భిన్నమైన పరిస్థితులు వున్నాయని, అయితే అండర్‌డాగ్స్ గా ఆడుతున్నప్పుడు తమపై సహజంగానే ఒత్తిడి మరింత ఎక్కువగా వుంటుందని అభిప్రాయపడ్డాడు.
ఏదైనా జరగొచ్చు
లాంక్‌షైర్ ఆటగాడు అలెస్టెయిర్ కుక్‌కు ఇండియాపై అత్యుత్తమ బ్యాటింగ్ రికార్డు వుంది. ఓవరాల్‌గా భారత్‌తో జరిగిన 20 టెస్టుల్లో 54 సగటు సాధించిన కుక్ భారతగడ్డపై 8 టెస్టుల్లో 60 సగటు సాధించాడు. ఇండియాపై అతను 294 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా నమోదు చేశాడు. ఒక పెద్ద సిరీస్‌కు వెళ్తున్నప్పుడు అంతకముందు జరిగిన సిరీస్ ఫలితాలను బట్టి మార్పులు చేస్తుంటామని, ఈసారి కూడా బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్‌లో ఓటమి ఫలితాలు చవిచూసినందున ఇప్పుడు జట్టులో కొన్ని మార్పులు చేస్తామని అలెస్టెయిర్ కుక్ తెలిపారు. నాలుగేళ్ళ క్రితం అహ్మదాబాద్ టెస్టు లో ఓడిపోయామని, ఆ తర్వాత పుంజుకున్నామని కుక్ గుర్తుచేశాడు. ఈసారి కూడా అలాంటి అద్భుతాలు జరగబోవని చెప్పలేమన్నారు. గత టూర్‌తో పోలిస్తే గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసార్‌లు లేకపోయినప్పటికీ, ఈసారి ఆరుగురు బౌలర్లను రంగంలోకి దించుతు న్నట్లు కుక్ చెప్పాడు. నాలుగేళ్ళ క్రితం అద్భుతంగా ఆడిన పనేసార్ వంటి అనుభవజ్ఞులు ఈసారి అందుబాటులో లేకపోవడం బాధాకరమని చెప్పారు. అయినప్పటికీ ఆఫ్ స్పిన్నర్లు మొయిన్ ఆలీ, గారెత్ బాటీ, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాఫర్ అన్సారీ, లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వంటి ఆటగాళ్ళు ఈసారి అందుబాటులో వున్నారని, రెండు రోజుల ప్రాక్టీసు సెషన్‌లో వారి బౌలింగ్‌కు మరింత పదునుపెట్టినట్లు చెప్పారు.

కోహ్లీ, అశ్విన్‌లపైనే కన్ను!

ఇంగ్లాండ్ హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ మీడియాతో మాట్లాడుతూ, భారత ఆటగాళ్ళలో కొంతమందిపై తాము దృషి పెట్టినట్లు చెప్పారు. వారిలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన స్పిన్నర్ ఆర్.అశ్విన్‌లు వున్నారన్నారు. వారిద్దరూ మంచి ఆటగాళ్ళని, సహజంగానే వారి నుంచి తమకు ముప్పు వుందని అభిప్రాయపడ్డారు. అయితే జట్టు కూర్పు గురించి బేలిస్ ఇంకా బయటపెట్టలేదు. రాజ్‌కోట్ చేరుకున్నాకే తుది జట్టును ఖరారు చేస్తామన్నారు. ఈసారి తుది జట్టు ఎంపిక క్లిష్టమైన వ్యవహారమేనని పేర్కొన్నారు.

అండర్సన్ వచ్చేస్తున్నాడు!

ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తిరిగి జట్టులోకి వచ్చేస్తున్న ట్లు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అలెస్టెయిర్ కుక్ వెల్లడించారు. ఆండర్సన్ రాక మాకొక మంచి వార్త అని శనివారంనాడు కుక్ మీడియాకు తెలిపారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగే రెండవ టెస్టు మ్యాచ్ సమయానికి ఆండర్సన్ జట్టులో చేరుతాడని ఆయనన్నారు. “ఆండర్సన్ రాక మాకు చాలా మంచి వార్త. గాయం నుంచి కోలుకోవడానికి అతను పోరాటమే చేశాడు. ఇప్పుడంతా ఓకే. వైజాగ్ టెస్టు నాటికి అతను జట్టులో చేరే అవకాశం వుంది. ఆండర్సన్ శరీర కదలికలు మరింత పరిశీలించాక మా బోర్డు అతన్ని ఇండియా పంపిస్తుంది” అని కుక్ తెలిపారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఆండర్సన్ కూడా ఇండియాలో ఆడుతున్నట్లు ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో అతను పాల్గొంటున్నట్లు లేదు. ఆండర్సన్ వచ్చేవారం ఇండియాలో ఇంగ్లాండ్ బృందంలో చేరుతాడని ఆ వెబ్‌సైట్‌లో ఇసిబి పేర్కొంది. 34 ఏళ్ల ఆండర్సన్ ఇంగ్లాండ్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్. అతను మొత్తం 463 వికెట్లు తీసుకున్నాడు. కుడి భుజానికి గాయం కారణంగా అతను బంగ్లాదేశ్ టూర్‌ను కూడా అతను మిస్సయ్యాడు.

జాయ్ రూట్ కీలకం

భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాయ్ రూట్ కీలక ఆటగాడిగా మారనున్నాడు. అందుకు తగ్గట్టుగానే అతను ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియంలో కఠినంగా ప్రాక్టీసు చేశాడు. 2012లో నాగ్‌పూర్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌తోనే టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జాయ్ రూట్ తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో 73, 20 నాటౌట్‌తో పరుగులు సాధించాడు. ఇండియాతో అతను ఆడిన ఆరు టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తంగా 611 పరుగులు చేయడం విశేషం. ఈసారి కూడా రూట్‌పై కెప్టెన్ కుక్ ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. అలాగే అశ్విన్ వంటి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోగల సత్తా రూట్‌కు వుందని కుక్ ఆశిస్తున్నాడు.