Tuesday, April 23, 2024

భద్రతామండలికి ఆగస్టు సారధి భారత్

- Advertisement -
- Advertisement -

India to host Security Council in August

 

న్యూఢిల్లీ : ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారతదేశం చేపట్టనుంది. అధికారికంగా ఈ బాధ్యతలను 1వ తేదీన ఇండియా స్పీకరిస్తుంది. ఈ నెలరోజుల పరిధిలో సముద్ర జలాల భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద నిరోధకం వంటి మూడు ప్రధాన అంశాలపై భద్రతా మండలి ఆమోదముద్ర ప్రక్రియ భారత్ చేతుల మీదుగా సాగుతుంది. భారతదేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాల నేపథ్యంలోనే భద్రతా మండలికి భారత్ సారథ్యం వహించడం ఓ ప్రతీకాత్మక గౌరవప్రద విషయం అని ఐరాసలో భారత రాయబారి టిఎస్ త్రిమూర్తి హర్షం వ్యక్తం చేశారు. భద్రతా మండలి ఛైర్మన్ హోదా వరుసగా అన్ని దేశాలకు చెందుతూ వస్తుంది. సోమవారం అంటే ఆగస్టు రెండవ తేదీన అధ్యక్ష స్థానంలో ఇండియా తొలి కార్యనిర్వాహక ఘట్టం ఆరంభం అవుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రతినిధి ఐరాస ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆగస్టు నెలకు సంబంధించి కౌన్సిల్ అజెండాను తెలియచేస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News