Home తాజా వార్తలు సందడే సందడి

సందడే సందడి

sachin-tendulkar

కోల్‌కతా: భారత గడ్డపై జరుగుతున్న తొలి డేనైట్ టెస్టును పురస్కరించుకొని కోల్‌కతా మహా నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ చారిత్రక మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్.లక్ష్మణ్, హర్భజన్ సింగ్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్లను ప్రత్యేక బండ్లలో మైదానంలో ఊరేగించారు.

Eden-Gardensకాగా, భారత్‌లో జరుగుతున్న తొలి డేనైట్ టెస్టు సమరాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈ మ్యాచ్‌కు పింక్ బంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన క్రికెట్ ప్రేమీకులు విచిత్ర వేషాధరణతో అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశారు. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పర్యవేక్షణలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు క్రీడా రంగంలో అసాధారణంగా రాణించిన దిగ్గజాలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, బ్యాడ్మింటన్ ఆణిముత్యం పి.వి.సింధు, బాక్సింగ్ గ్రేట్ మేరీకోమ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలను క్రికెట్ బోర్డు తరఫున సత్కరించారు. ఇక, ఈ మ్యాచ్‌కు ఊహించిన స్పందన లభించడంతో నిర్వాహకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.Eden

Eden-Gardens

rahul-dravid

Kolkata--Eden

India vs Bangladesh Day Night Test