Thursday, April 25, 2024

రాణించిన మయాంక్, పృథ్వీషా

- Advertisement -
- Advertisement -

India vs Kiwis

 

కివీస్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన టీమిండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇటీవల మూడు వన్డేల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత్ టెస్టు సిరీస్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించింది. శనివారం రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 59 పరుగులతో నిలిచిన భారత్ ఆదివారం నాలుగు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (31 బంతుల్లో 39), మయాంక్ అగర్వాల్ (99 బంతుల్లో 81) శుభారంభం అందించారు. చివరి రోజు వీరిద్దరూ మరో 13 పరుగులు జోడించిన తర్వాత జట్టు స్కోరు 72 పరుగుల వద్ద పృథ్వీ షా తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శుభ్‌మన్‌గిల్ మరోసారి నిరాశ పరిచాడు. కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

తర్వాత వచ్చిన రిషభ్ పంత్ మయాంక్‌తో కలిసి మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. పంత్ 65 బంతుల్లో నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. వీరిద్దరూ సటయిన తర్వాత వచ్చిన వృద్ధిమాన్ సాహా (35 బంతుల్లో 30 పరుగులు), అశ్విన్ (43 బంతుల్లో 16 పరుగులు) ఆట ముగిసే వరకు కొనసాగారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఎలెవన్ 235 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా(2/18), ఉమేశ్ యాదవ్ (2/49), మహ్మద్ షమీ (3/17), నవ్‌దీప్ సైనీ (2/58) అద్భుతంగా బౌల్ చేశారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల ఆధిక్యత లభించింది. కాగా ఈ నెల21నుంచి భారత్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

India vs Kiwis practice match draw
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News