Thursday, March 28, 2024

భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ధర్మశాలలో ఈ నెల 12న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఈ నెల 15న, 18న జరగాల్సిన మిగతా రెండు వన్డే మ్యాచ్ లు రద్దయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఐపిఎల్ 13వ సీజన్ ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఐపిఎల్ మ్యాచ్ లను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియాలకు వచ్చే అవకాశముండడంతో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఐపిఎల్ ను వాయిదా చేశారు. మరోవైపు ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ కూడా రద్దైంది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు శ్రీలంక వెళ్లిన తమ జట్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తిరిగి స్వదేశానికి రావాలని కోరింది.

ఇక, భారత్ లో కరోనా వైరస్ కేసులు 81కి చేరాయి. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఢిల్లీ, కేరళ, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ఇవ్వగా.. సినిమా హాళ్లను మూసివేయాలని ఆదేశించాయి.

India vs South Africa ODI Series Called Off

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News