Wednesday, April 24, 2024

పరీక్షలు చేస్తే.. భారత్ లోనే కేసులు ఎక్కువ: ట్రంప్

- Advertisement -
- Advertisement -

Trump

వాషింగ్టన్‌ః భారత్, చైనాల్లో కరోనా పరీక్షలు ఎక్కువ నిర్వహించి ఉంటే అమెరికాకన్నా ఎక్కువ కేసులు నమోదయ్యేవని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ అన్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో రెండు కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మన దేశం మళ్లీ తెరుచుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా మన ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని అమెరికా ప్రజలకు ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నెల అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు పెరుగుతాయన్న అంచనాలున్నట్టు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జాన్‌హాప్కిన్స్ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ ప్రకారం అమెరికాలో దాదాపు 19 లక్షల కేసులు నమోదయ్యాయి. 1,09,000 మందికిపైగా మరణించారు. భారత్‌లో 2,36,184, చైనాలో 84,177 కేసులు నమోదయ్యాయి. భారత ఆరోగ్యశాఖ ప్రకారం మన దేశంలో 40 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు. ట్రంప్ ప్రకారం జర్మనీలో 40 లక్షలు, దక్షిణకొరియాలో 30 లక్షల పరీక్షలు నిర్వహించారు.

India will’ve more corona cases with more tests:Trump

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News