Friday, March 29, 2024

టీమిండియా బోణీ

- Advertisement -
- Advertisement -

India win first T20 against Australia

 

రాహుల్, జడేజా మెరుపులు, చెలరేగిన చాహల్, నటరాజన్ మ్యాజిక్, తొలి టి20లో భారత్ గెలుపు

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది.

శుభారంభం లభించినా

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన కంగారూలకు ఓపెనర్లు అరోన్ ఫించ్, డి ఆర్సీ షార్ట్ శుభారంభం అందిచంఆరు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 26 బంతుల్లోనే ఐదు ఫోర్లు, సిక్స్‌తో 35 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్‌ను కూడా చాహల్ వెనక్కి పంపాడు. వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్మిత్ ఈ మ్యాచ్‌లో మాత్రం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఆదుకుంటాడని భావించిన స్టార్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ కూడా నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి నాటరాజన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. ఈ దశలో ఓపెనర్ డి ఆర్సీ షార్ట్, హెన్రిక్స్‌లు కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

ఇద్దరు కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచేందుకు ప్రయత్నించారు. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన డిఆర్సీ షార్ట్ మూడు ఫోర్లతో 38 పరుగులు చేసి నటరాజన్ చేతికి చిక్కాడు. దీంతో 38 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన హెన్రిక్స్ ఒక ఫోర్, సిక్సర్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో అబాట్ (12), స్వెప్సన్ (12) ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన యజువేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన చాహల్ 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. చాహల్‌కే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు యువ బౌలర్ నటరాజన్ కూడా మూడు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు.

రాహుల్ జోరు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ధావన్ (1) స్టార్క్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి సహకారంతో మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ స్కోరును పరిగెత్తించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. దీంతో పవర్‌ప్లేలో 42 పరుగులు సాధించింది. ఇక కుదురుగా ఆడుతున్న కోహ్లి (9)ను స్వెప్సన్ ఔట్ చేశాడు. ఈ దశలో సంజు శాంసన్ ధాటిగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాడు. ఒక ఫోర్, మరో సిక్స్‌తో 23 పరుగులు చేసి జోరు మీద కనిపించిన శాంసన్‌ను హెన్రిక్స్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన మనీష్ పాండే కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే రాహుల్ (51; 40 బంతుల్లో 5×4, 1×6) కూడా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఒక దశలో 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

జడేజా మెరుపులు

ఈ సమయంలో జట్టును ఆదుకునే బాధ్యతను రవీంద్ర జడేజా తనపై వేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతనికి హార్దిక్ పాండ్య (16) అండగా నిలిచాడు. అద్భుత బ్యాటింగ్ చేసిన జడేజా 23 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 44 పరుగులు సాధించాడు. జడేజా మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌కు చివరి మూడు ఓవర్లలో 46 పరుగులు లభించాయి. ఒక సమయంలో స్కోరు 120కి చేరడం కూడా కష్టంగా కనిపించినా జడేజా అసాధారణ బ్యాటింగ్‌తో భారత్ 161 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెన్రిక్స్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News