Thursday, April 25, 2024

డిజిటల్ విప్లవం

- Advertisement -
- Advertisement -

India witnessing digital-first revolution says Mukesh Ambani

ముందుచూపుతో డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ బిల్లులు,  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ

న్యూఢిల్లీ : భారతదేశం తొలిసారిగా డిజిటల్ విప్లవాన్ని చూస్తోందని, డిజిటల్ సమాజాన్ని నిర్మించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ బిల్లు ప్రతిపాదనలకు ఆయన మద్దతు తెలిపారు. భారతదేశం అత్యంత ముందుచూపుతో విధానాలు, నిబంధనలను తీసుకొస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫినిటీ ఫోరమ్ చర్చలో అంబానీ మాట్లాడుతూ, భారతదేశం ముందుచూపుతో పాలసీలు, రెగ్యులేషన్స్ తీసుకొస్తోందని అన్నారు. ఆధార్, జన్‌ధన్ ఖాతాలు, యుపిఐ విధానం వంటి గొప్ప నిర్ణయాలు భారత్ తీసుకుంది. ఇప్పుడు వివరాల గోప్యత బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లులను ప్రవేశపెట్టే దిశగా ముందడు వేశాం, కావున మనం ఇప్పుడు సరైన దారిలో ఉన్నామని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

అంబానీకి చెందిన అతిపెద్ద టెలికాం సేవల సంస్థ రిలయన్స్ జియో కూడా ఫైనాన్స్ యాక్సెస్‌ను పెంచేందుకు బ్లాక్ చైన్‌కు మద్దతు ఇచ్చి, వాస్తవ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధిని కోరుకుంటోంది. బ్లాక్‌చైన్ ఒక టెక్నాలజీ, ఇది నమ్మకమైంది, క్రిప్టోతో పోలిస్తే భిన్నమైందని ముకేశ్ అన్నారు. ఆర్థిక సేవల్లో డిజిటలైజేషన్ అప్పుడప్పుడు జరుగుతోందని, కొత్త టెక్నాలజీతో వికేంద్రీకరించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ విధానాలు ఉన్నాయి, కానీ వికేంద్రీకరణ సాంకేతికత పరిష్కారాలకు మార్గం ఉంటుందని, ఇక్కడ ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు, ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అన్నారు. రియల్ టైమ్ టెక్నాలజీలు రోజుల్లో, గంటల్లోనే వ్యాపారాలను పరిష్కరించడంలో దోహదం చేస్తాయని, కానీ దీనికి సమయం పడుతుందని అన్నారు.

ప్రపంచ దేశాల ప్రయత్నం అవసరం : నిర్మల

సరిహద్దులు లేని సాంకేతిక పరిజ్ఞానం నిర్వహణకు ప్రపంచ దేశాల ప్రయత్నం అవసరం, ఒక ఫార్ములా అంటూ ఏ దేశానికి లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వర్చువల్ కరెన్సీల ఎలా నియంత్రించాలనే అంశంపై జరిగిన చర్చలో ఆమె ఈ విధంగా అన్నారు. దేశీయంగా తాము ఆలోచించినప్పటికీ, ఆఖరికి ప్రపంచ స్థాయి యంత్రాంగం టెక్నాలజీని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించే దిశగా భారత ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుందని, అయితే టెక్నాలజీపై నిషేధం కాదని అన్నారు. అప్పటి నుంచి డిజిటల్ కరెన్సీలను నియంత్రించాలని, వాటిపై నిషేధం వద్దనే వాదనలు ఎక్కువగా వినిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News