Friday, April 19, 2024

భారత మహిళల గెలుపు

- Advertisement -
- Advertisement -

India-Women

మెల్‌బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కిందటిసారి ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అష్లే గార్డనర్ 57 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో 11 ఫోర్లతో 93 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను ఆదుకుంది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మంధాన శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చెలరేగి ఆడిన షఫాలి వర్మ 28 బంతుల్లోనే ఒక సిక్స్, మరో 8 ఫోర్లతో 49 పరుగులు చేసింది. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించింది. తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ ఐదు ఫోర్లతో వేగంగా 30 పరుగులు సాధించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన ఏడు బౌండరీలతో 55 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేసింది.

India Women beat Australia Women by 7 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News