Friday, April 19, 2024

టీమిండియా జయకేతనం

- Advertisement -
- Advertisement -

India won match by 66 runs against Afghanistan

చెలరేగిన రాహుల్, రోహిత్, అశ్విన్ మ్యాజిక్, అఫ్గాన్‌పై భారత్ గెలుపు

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కరీం జన్నత్ 42 (నాటౌట్), కెప్టెన్ మహ్మద్ నబి (35) మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో షమి మూడు, అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టారు.

రాహుల్, రోహిత్ విధ్వంసం

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు కెఎల్.రాహుల్, రోహత్ శర్మలు శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ఇద్దరు పోటాపోటీగా భారీ షాట్లతో అలరించారు. వరుస ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. షరాఫుద్దీన్ వేసిన రెండో ఓవర్‌లో రాహుల్ కళ్లు చెదిరే సిక్సర్‌ను బాదాడు. ఇక నవీన్ ఉల్ హక్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో భారత్‌కు 17 పరుగులు లభించాయి. మధ్యలో అఫ్గాన్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కానీ కీలక సమయంలో రాహుల్, రోహిత్‌లు మళ్లీ పుంజుకున్నారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించారు. దీంతో పది ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 85 పరుగులకు చేరింది.

ఆ తర్వాత వీరిద్దరూ మరింత దూకుడును ప్రదర్శించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 47 బంతుల్లోనే 8 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 140 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ వెంటనే రాహుల్ కూడా ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన రాహుల్ 48 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఇక చివర్లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ధాటిగా ఆడిన పంత్ 13 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 27, హార్దిక్ 13 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 35 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా స్కోరు 210 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News