నాగ్‌పూర్ : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టి20లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. భారత రాహుల్ 71, పాండే 30, కోహ్లీ 21 పరుగులు చేశారు.
145 పరుగుల విజయ లక్ష్యంతో జరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను మొదటి నుంచి భారత కట్టడి చేశారు. స్టోక్స్ 38, రూట్ 38 మినహా మిగితా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 139 పరుగులు చేసింది. అఖరి వరకు ఓవర్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలింగ్‌లో నెహ్రా 3, బుమ్రా 2, మిశ్రా 1 వికెట్ తీశారు.
రెండో టి20లో భారత్ ఘన విజయం
- Advertisement -
- Advertisement -