Friday, April 26, 2024

తెలంగాణ వలే మిగతా రాష్ట్రాలన్నీ పనిచేస్తే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వలే దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ పనిచేస్తే భారత్ 5 ట్రిలియన్ ఎకనామీ అయి ఉండేదని తెలంగాణ ఐటి, ఇండస్ట్రీస్ మినిష్టర్ కెటి. రామారావు అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య(సిఐఐ) సమావేశంలో ఆయన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. ‘ఇక్కడి ప్రజలకు శక్తిసామర్థాలు ఉన్నాయి. తెలంగాణ వలే మిగతా భారత దేశం పనిచేసి ఉంటే 5ట్రిలియన్ ఎకనామీ కాగలిగి ఉండేదని చెప్పండి’ అన్నారు. తెలంగాణ బాగా పనిచేస్తున్నప్పటకీ దానిపై జరిమాన విధిస్తున్నారని కెటిఆర్ అన్నారు. ‘హైదరాబాద్ ఫార్మా సిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మ క్లస్టర్ ఇక్కడ ఉంది. భారత జౌళిలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇక్కడ ఉంది. కానీ దానికి భారత ప్రభుత్వం నుంచి మద్దతు లభించడంలేదు. ఎలక్ట్రానిక్స్‌లకు మనకు కొత్త తయారీ క్లస్టర్లు కూడా రావు’ అని ఆయన తెలిపారు.

‘తెలంగాణలో 2014లో తలసరి ఆదాయం రూ. 1.24 లక్షలుగా ఉండింది ఇప్పుది రూ. 3.17 లక్షలు అయిందన్నారు. రాష్ట్ర స్థూలోత్పత్తి(జిఎస్‌డిపి) 2014లో రూ. 5.06 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడది రూ. 13.27 లక్షల కోట్లు అయిందన్నారు. ఈ లెక్కన మనం 155 శాతం నుంచి 162 శాతానికి మెరుగుపడ్డాం. కానీ భారత దేశంలోని మిగతా రాష్ట్రాలు తెలంగాణ మాదిరి రాణించడంలేదు’ అన్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ అని కెటిఆర్ కొనియాడారు. 35 శాతం వ్యాక్సిన్లు అంటే 9 బిలియన్ డోసెస్‌లు హైదరాబాద్‌లోని ఉత్పత్తి అవుతున్నాయన్నారు. రాబోయే సంవత్సరాలలో ఇది 14 బిలియన్ డోసెస్ స్థాయికి పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి మాట్లాడుతూ అది వాస్తవ రూపం ధరిస్తే మంచి నినాదమే కాగలదన్నారు. ఓకానొక సమావేశంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీస్(ఏఐఎంఈడి) హెడ్ డాక్టర్ రాజీవ్ నాథ్ తాను సమావేశమైనప్పుడు ఆయన తనకో విషయం చెప్పారన్నారు. అదేమిటంటే ఒకానొకప్పుడు మన దగ్గిర 1200 కంపెనీలు ఉండేవి. కానీ వాటిలో 600 మూతపడి ఇప్పుడు కేవలం 600 మిగిలి ఉన్నాయన్నారు. చైనాలో ఉత్పత్తి చేసి ఇక్కడికి దిగుమతి చేసుకోవడం ఎందుకని చౌకగా ఉంది? స్థానిక వస్తువుల కన్నా వేలాడి మైళ్లు దాటి ఎందుకంత వారి వస్తువులు చౌకగా లభిస్తున్నాయి?’ అని కెటిఆర్ ప్రశ్నించారు.

భారత్‌కు కావలసింది ‘హైదరాబాద్ వంటి ఇంజిన్లు’ అని అన్నారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని, మెరుగైన పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహం కరువైతే మనకు మనమే గొప్ప అపచారం చేసుకున్నవారం కాగలమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News