Home జాతీయ వార్తలు తెల్ల జెండాలతో వచ్చి మీ వాళ్ల శవాలను తీసుకెళ్లండి

తెల్ల జెండాలతో వచ్చి మీ వాళ్ల శవాలను తీసుకెళ్లండి

Indian Army

 

పాకిస్థాన్‌కు భారత సైన్యం సూచన

న్యూఢిల్లీ : కశ్మీర్ కెరాన్ సెక్టార్‌లో మృతి చెందిన ఉగ్రవాదుల భౌతిక కాయాలను తీసుకువెళ్లాలని పాకిస్థాన్‌కు భారతీయ సైన్యం సూచించింది. అక్కడ భారతీయ సైన్యం జరిపిన ప్రతి కాల్పుల్లో పాకిస్థానీ కమాండో, ఉగ్రవాది హతులు అయ్యారు. పాకిస్థాన్ సైన్యం వారు తెల్లజెండా ప్రదర్శిస్తూ వచ్చి సరిహద్దు ల నుంచి ఈ భౌతిక కాయాలను తీసుకువెళ్ల వచ్చునని పేర్కొన్నారు. పాకిస్థాన్ సైన్యం సాయంతో ఉగ్రవాదులు భారత సరిహద్దులలోకి చొచ్చుకుని రావడాన్ని నిరోదిస్తూ భారత సైనిక దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి భౌతిక కాయాలు ఇప్పటికీ సరిహద్దులలో ఉన్నాయి.

అయితే తమ బలగాలు చొరబాట్లకు సహకరించలేదని పాకిస్థాన్ సైన్యం తెలియచేస్తూ వస్తోంది. కేవలం తమపై దుష్ప్రచారానికి ఇండియా ఈ విధంగా స్పందిస్తోందని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎల్‌ఒసి వెంబడి తమ చొరబాట్లు ఉండటం కానీ, మృతదేహాలు అక్కడ పడి ఉండటం కానీ ఏమీ జరగలేదన్నారు. కెరాన్ సెక్టర్‌లో పాకిస్థాన్ సైనికులు తోడుగా ఉగ్రవాదుల బృందం భారతీయ సైనిక స్థావరంపై దాడికి దిగిన దశలో జరిగిన పరస్పర కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరిలో ఒకరు పాకిస్థాన్ ప్రత్యేక బలగాలకు చెందిన వ్యక్తి అని భారత సైన్యం తెలిపింది.

Indian Army asks Pakistan military to take possession