Home జాతీయ వార్తలు మంచుకొండల్లో ‘యతి’ జాడలు

మంచుకొండల్లో ‘యతి’ జాడలు

Snow-Man

ఢిల్లీ: మన భారతీయ సంప్రదాయంలో యతి గురించిన ప్రస్తావన ఉంది. భారీ శరీరంతో భయంకరంగా కన్పించే మంచు మనిషిని ‘యతి’ అంటారు. యతి.. అనేది ఇప్పటివరకు పురాణాల్లో, జానపద కథల్లో వినిపించే ఓ కల్పిత పాత్ర మాత్రమే. నిజంగా భూమిపై  మంచు మనిషి ఉన్నాడన్న ఆనవాళ్లు కనిపించాయి. తాజాగా భారత ఆర్మీ’యతి’జాడపై ట్వీట్‌ చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను భారత సైన్యం గుర్తించింది.హిమాలయాల్లో సాహస యాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్‌ 9న మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న పాదముద్రలు గుర్తించారు. ఆ పాదముద్రలు ‘యతి’వే అయి ఉంటాయని ఆర్మీ ట్విటర్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆర్మీ ట్విటర్‌లో పోస్టు చేసింది.

Indian Army Mysterious footprints found in the Himalayas