అక్టోబర్ 24 నుంచి మెగా టోర్నీ ప్రారంభం
న్యూఢిల్లీ : అక్టోబర్ 24 తేదీ నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ చాంపియన్ షిప్ బాక్సింగ్ పటీల్లో పాల్లొనేందుకు 13 మంది బాక్సర్లతో కూడిన భారత బాక్పింగ్ జట్టు బుధవారం బెల్గ్రేడ్కు బయల్దేరి వెళ్లింది. వీరితో ఆసియా పతక దవిజేతలు దీపక్ కుమార్(51 కేజీలు), శివధాపా(63.5 కేజీలు), సంజీత్(92 కేజీలు) వంటి మేటి బాక్సర్లు ఉన్నారు. కాగా, శివధాపా 2015లో జరిగిన ప్రపంచ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. భారత బాక్సింగ్ జట్టుతో పాటు డైరెక్టర్ శాంటిగో నీవా, నూతనంగా నియమితులైన ప్రధాన కోచ్ నరేందర్ రాణా, గతంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన దేవేండ్రో సిండ్, పలువురు అసిస్టెంట్ కోచ్ ఉన్నారు.
ఇటీవలె ముగిసిన టోక్యో ఒలింపిక్ గేమ్స్ తరువాత భారత బాక్సింగ్ జట్టు పాల్గొనే తొలి అంతర్జాతీయ క్రీడలు ఇవే. కాగా, వీరికి 10 రోజులు మాత్రమే పాక్టీస్ మిగిలుంది. 48, 51, 54, 57, 60, 63.5, 67, 71, 75, 80, 86, 92కేజీల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు బెల్గ్రేడ్లోని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ తెలిపింది. కాగా, ఈ టోర్నీలో మొత్తం 105 దేశాల నుంచి 600 మంది బాక్సర్లు పాల్గొననున్నట్లు తెలియజేసింది. ఈ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 1,00,000 యుఎస్ఎ డాలర్లు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 50,000 యుఎస్ఎ డాలర్లు, బ్రొంజ్ మెడల్ సాధించిన వారికి 25,000 యుఎస్ఎ డాలర్లను ప్రైజ్‌మనీగా అందించనున్నట్టు తెలుస్తాంది.
Indian boxing team leaves for world championships