Friday, March 29, 2024

విమానాల తోకలను గుర్తించడంలో గిన్నిస్ బుక్‌లోకి భారతీయ బాలుడు

- Advertisement -
- Advertisement -

Indian boy creates record for identifying most airplane tails

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసించే ఒక భారతీయ బాలుడు విమానం తోకల ద్వారా వాటి ఎయిర్‌లైన్స్‌ను అత్యంత వేగంగా గుర్తించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. అబూ ధాబీలో నివసించే 12 ఏళ్ల సిద్ధాంత్ గుంబర్ 60 సెకండ్లలో 39 విమానాల తోకలను బట్టి అవి ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందినవో గుర్తించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. గతంలో ఇదే బాలుడు అత్యంత ఎత్తైన 100 భవనాలను గుర్తించిన అత్యంత పిన్నవయస్కుడైన వ్యక్తిగా రికార్డు సాధించినట్లు గల్ఫ్ న్యూస్ తెలిపింది.
హర్యానాకు చెందిన సిద్ధాంత్ గతంలో ప్రపంచంలో ఎత్తైన 100 భవనాలను వాటి ఎత్తు, ప్రదేశంతోసహా గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. ఒక్కో విమానం తోకను గుర్తించడానికి సిద్ధాంత్ 1.5 సెకండ్లు తీసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News