Wednesday, April 24, 2024

మాస్కోలో తాలిబన్ బృందంతో భారత్ ప్రతినిధుల భేటీ

- Advertisement -
- Advertisement -

Indian delegation meets Taliban in Moscow

మాస్కో: అఫ్గానిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వ ఉపప్రధాని అబ్దుల్ సలామి హనాఫీ నేతృత్వం లోని ఉన్నత స్థాయి తాలిబన్ ప్రతనిధు బృందాన్ని మాస్కోలో బుధవారం భారత ప్రతినిధి బృందంతో సాధారణ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అఫ్గాన్‌కు విస్తృత మానవీయ సహకారాన్ని భారత్ అందిస్తుందని అఫ్గాన్ ప్రతినిధులకు భారత్ బృందం వివరించింది. భారత ప్రతనిధి బృందానికి భారత విదేశీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి జెపి సింగ్ నేతృత్వం వహించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లోని పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ ఇరాన్ డివిజన్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రష్యా ఆహ్వానంపై వీరు మాస్కోకు వచ్చారు. ఈ సమావేశం గురించి భారత ప్రభుత్వం ఎలాంటి వివరాలు తెలియచేయలేదు.

ఉభయ దేశాలు పరస్పరం తమ సమస్యలను పరిష్కరించుకుని దౌత్యపరంగా, ఆర్థిక పరంగా సంబంధాలు పెంపొందించుకోవాలని చర్చించినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి జముల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ సమావేశం సందర్భంగా హనాఫీ అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పిలుపునిచ్చారు. అఫ్గాన్‌ను ఒంటరి చేయాలని ఎవరికీ ఆసక్తి లేదని, గతంలో ఇది నిరూపణ అయిందని ఆయన పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్ సెంట్రల్ బ్యాంకులో స్తంభించి ఉన్న 9.4 బిలియన్ డాలర్ల నగదు నిల్వలను విడుదల చేయాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News