Home తాజా వార్తలు టాంజానియాలో రోడ్డు ప్రమాదం: కొరటికల్ వాసి మృతి

టాంజానియాలో రోడ్డు ప్రమాదం: కొరటికల్ వాసి మృతి

  Indian Dies In Africa Road Accident
ఆత్మకూరు(యం) : మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన సోలిపురం రాజశేఖర్‌రెడ్డి (24) ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో మంగళవారం బోరుబండి ,ట్రక్కు ఢీ కొట్టిన ప్రమాదంలో మరణించాడు. కొరటికల్ మదిరె ఇప్పల్ల గ్రామానికి చెందిన సోలిపురం రాంరెడ్డి ,రమణమ్మల కుమారుడు గత కొంత కాలంగా బోరు బండిపై పనిచేస్తున్నాడు. బోర్లు వేయు నిమిత్తం ఆఫ్రికా ఖండం లోని టాంజానియాకు వెళ్లాడు . అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో  బారీ మంటలు లేచి కాలిబూడిదై అస్తికలు మాత్రమే ఆనవాలుగా మిగిలినట్లు తెలియజేసారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ,బంధువులు ,మిత్రులు తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేస్తూ విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో కుటుంబ రోదనలు గ్రామవాసులను కలచివేసాయి.

  Indian Dies In Africa Road Accident