Friday, March 29, 2024

అఫ్ఘన్ అల్లకల్లోలం: భారత ఎంబసీ మూసివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధినంలోకి వెల్లడంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. ప్రజలు భయాందోళనతో దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాబూల్లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కాబూల్లోని భారత ఎంబసీని ఖాళీ చేసి..కీలక పత్రాలతోపాటు సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను ఇండియాకు తరలిస్తున్నట్లు తెలిపారు. వాయుసేనకు చెందిన సి-17 విమానంలో వీరిని తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. అఫ్గన్ లో ఉన్న భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Indian Embassy closed in Kabul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News