Home తాజా వార్తలు కౌంటింగ్ టెన్షన్….

కౌంటింగ్ టెన్షన్….

lok-sabha-election-2019గెలుపుధీమాలో ఎవరికివారే
అనుచరులతో అభ్యర్థ్ధుల మంతనాలు
జోరు పెంచిన పందెం రాయుళ్లు
నిఘానీడలో ఈవీఎం మెషిన్లు
ఈనెల 23న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: నగరంలో ఎక్కడ చూసిన, ఎవరిని పలకరించిన కౌంటింగ్‌పై ప్రధాన చర్చ సాగుతుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గత నెల 11న ముగిసింది. అభ్యర్ద్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఓట్ల లెక్కింపుకు గడువు నాలుగురోజులే మిగిలింది. ఈనెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో టిఆర్‌ఎస్,కాంగ్రెస్,బిజెపి అభ్యర్ద్థులు గెలుపుపై అనుచరులతో అంచనాలు వేస్తున్నారు. లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఏజెంట్లకు సూచిస్తూ విజయోత్సవ ర్యాలీలు అట్టహాసంగా నిర్వహిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. గ్రేటర్ నగరంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు స్థ్దానాలుండగా వాటిలో ముక్కోణపు పోటీ జరిగింది.

హైదరాబాద్ స్ద్థానం నుంచి 15 అభ్యర్ద్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ టిఆర్‌ఎస్ తరుపున పుస్తె శ్రీకాంత్, ఎంఐఎం నుంచి సదుద్దీన్ ఓవైసీ,కమలం పార్టీ అభ్యర్థ్దిగా భగవంతరావు ఉంది. సికింద్రాబాద్ రేసులో 28 ఉండగా ప్రధానంగా గులాబీ పార్టీ నుంచి తలసాని సాయికిరణ్‌యాదవ్, హస్తం బరిలో అంజన్‌కుమార్‌యాదవ్, బిజెపి తరుపున కిషన్‌రెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు.మల్కాజిగిరి స్ద్థానం నుంచి టిఆర్‌ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ రేసులో రేవంత్‌రెడ్డి,కమలదళం నుంచి రామచందర్‌రావు, చేవెళ్ల పార్లమెంటులో గులాబీ పార్టీ తరుపున గడ్డం రంజిత్‌రెడ్డి,కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,బిజెపి బరిలో జనార్ధన్‌రెడ్డి పోటీ చేసి గెలుపు కోసం తీవ్ర శ్రమించారు. ఖచ్చితంగా విజయం తమనే వరిస్తుందని పేర్కొంటున్నారు. సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తమను పార్లమెంటు సీటుపై కూర్చోబెడుతాయని టీఆర్‌ఎస్ అభ్యర్ద్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థ్దులు తెలంగాణ ఏర్పాటు చేసిన ఘనత, రాహాల్‌గాంధీ చరిస్మా తమకు పనిచేస్తుందని గెలుపుపై అం చనా వేస్తున్నారు.

కమలనాథులు ప్రధాని మోడీ పథకాలపై తమకు శ్రీరామరక్ష అంటూ మళ్లీ దేశంలో రెండవసారి ప్రధాని పీఠం మాదేనని లెక్కలు వేస్తూ గ్రేటర్ పార్లమెంటు సీట్లల్లో తామే ముందంజలో ఉంటామని బాహాటంగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు స్ద్థానాలు, 15 అసెంబ్లీ స్థ్దానాలున్నాయి. హైదరాబాద్ పరిధిలో 7, సికింద్రాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ స్ద్థానాలు ఉన్నాయి. కంటోన్మెంట్ స్థ్దానం మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోకి వెళ్లింది. 15 నియోజకవర్గాల్లో 3,979 పోలింగ్ కే్రందాలున్నాయి. హైదరాబాద్ పరిధిలో 1937, సికింద్రాబాద్ పరిధిలో 1810 కేంద్రాలున్నాయి.

ప్రతి నియోజకవర్గానికి 14: లెక్కింపునకు ప్రతి నియోజకవర్గానికి 14 ఏర్పాటు చేశారు. ప్రతి టేపతి వద్ద ఓసూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అభ్యర్థ్ది తరుపున ఓకౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. మొదట ఎన్ని మొత్తం ఓట్లకు ఎన్ని ఓట్లు పోలైనవో వివరాలను లెక్కింపు సిబ్బంది నమోదు చేస్తారు. అఖరిల్లో అభ్యర్ద్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తెలుపుతారు. ఆయా ప్రతాలపై మైక్రో అబ్జర్వర్ సంతకం చేసి ఆర్వోకు అందజేస్తారు.

అదే విధంగా అన్ని టెబుళ్ల నుంచి వచ్చిన ఫలితాలను రిటర్నింగ్ అధికారి నియోజకవర్గానికి ఒకరు చొప్పన ప్రత్యేకంగా నియమించిన అధికారులు పరిశీస్తారు. వీరే అన్ని నిర్ధ్దారించుకున్న తరువాత రౌండ్ ఫలితాలను ప్రకటిస్తారు. ఒక రౌండ్‌లో 14పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను లెక్కిస్తారు. ఈవీఎంలపై ఉన్న బటర్ నొక్కగానే ఫలితం వస్తుంది. ఉన్న అన్ని పొలింగ్ కేంద్రాల ఫలితాలను కలిపి మొత్తం రౌండ్ ఫలితాన్ని ప్రకటించాలి. అందుకు 20నిమిషాలు పడుతుంది.

సిసికెమెరాల నడుమ ఈవీఎంలు బయటికి తీసుకొస్తారు: భారీ భద్రతతో ఉన్న ఈవీఎంలను సీసికెమెరాల నడుమ బయటికి తీసుకొస్తారు. దారి పొడువునా కెమెరాల నిఘా ఉంటుందని, వాటి చిత్రాలను కమాండ్ కంట్రోల్ రూం నుంచి అధికారులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తుంటారు.

గెలుపుపై పందెం రాయుళ్లు జోరు: పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్దుల గెలుపుపై పందెం రాయుళ్ల బెట్టింగ్‌లు పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న నాలుగు సీట్లలో మూడు టీఆర్‌ఎస్ ఖాతాలు పడుతాయని రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షల వరకు పందెం కాస్తున్నారు. కౌంటింగ్ గడువు దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ నగరంలో ఆంధ్రా ఫలితాలపై కూడ కోట్ల రూపాయలు బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఈఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాలకు చెందిన రాయుళ్లు సుమారు రూ. 10 కోట్లవరకు పందాలు పెడుతారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Indian general election 2019