Home అంతర్జాతీయ వార్తలు పరిణయమాడిన భారత్-పాక్ యువతులు

పరిణయమాడిన భారత్-పాక్ యువతులు

Marriage

 

లాస్ ఏంజిలెస్: భారత్-పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు కాలిఫోర్నియాలో పరిణయమాడారు. ఈ స్వలింగ సంపర్కుల వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. భారతీయ సంతతికి చెంది కొలంబియాలో స్థిరపడిన బియాంకా మెయిలీ క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయి. అలాగే పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం అమ్మాయి సైమా. వీరిద్దరూ అమెరికాలో ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. తొలి చూపులోనే వారు ప్రేమలో పడ్డారు. అత్యంత వైభవంగా జరిగిన వివాహ వేడుకలో ఈ జంట తమ మత సాంప్రదాయాలననుసరించి వివాహం చేసుకున్నారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోను బియాంకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నీతో జీవితం ఎంతో మధురం.. అంటూ తన మనోభావాన్ని పంచుకుంది. పెళ్లికి హాజరైన పలువురు అతిథులు ఒక అందాల రాణికి ఇంకో అందమైన రాశి తోడు దొరికింది అంటూ ఆశీర్వదించారు.

 
Indian Girl Marry to Pak Girl in California,Indo-Pak same sex couple look breathtaking in fairy tale wedding. See pics The couple tied the knot at a grand ceremony that brought together their respective cultures and traditional ceremonies.