Tuesday, April 23, 2024

అమెరికాలో కేరళ నర్సు హత్య..

- Advertisement -
- Advertisement -

Indian Nurse Stabbed death in US

వాషింగ్టన్: కేరళకు చెందిన మెరిన్‌జాయ్ (26) అనే నర్సు అమెరికాలో భర్త చేతిలో హత్యకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు(అమెరికాలో ఉదయం7:40కి) ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్ నగరంలో ఈ సంఘటన జరిగింది. మెరిన్‌జాయ్ ఓ హాస్పిటల్‌లోని కొవిడ్ వార్డులో పని చేస్తున్నారు. రాత్రి షిఫ్టులో డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చిన సమయంలో ఆమె భర్త ఫిలిప్ మాథ్యూ కారుతో ఢీకొట్టి కత్తితో పలుమార్లు పొడిచి చంపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫిలిప్‌మాథ్యూ(34) కూడా తనను తాను కత్తితో గాయపరుచుకున్నాడు. అతన్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంతకాలంగా వేరుగా ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఇద్దరూ కేరళలోని కొట్టాయంకు చెందినవారే.

Indian Nurse Stabbed death in US

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News