Thursday, April 25, 2024

కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా భారతీయ సంతతి వ్యక్తి

- Advertisement -
- Advertisement -

Indian-origin Judge nominated to Canada SC

టోరంటో: కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మొట్టమొదటిసారి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. భారతీయ సంతతకి చెందిన జస్టిస్ మహమూద్ జమాల్‌ను కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రధాని జస్టిన్ ట్రూడో నామినేట్ చేశారు. కెనడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి శరణార్థి, మొదటి యూదు మహిళ రోసలీ సిల్బర్‌మన్ అబెల్లా పదవీ విరమణ చేస్తుండగా ఆమె స్థానంలో జస్టిస్ జమాల్ పేరును ట్రూడో మంగళవారం నామినేట్ చేశారు. భారత్ నుంచి కెన్యాకు వలస వచ్చిన కుటుంబంలో జన్మించిన జస్టిస్ జమాల్ రెండేళ్ల తర్వాత బ్రిటన్‌కు వలస వెళ్లింది. 1981లో ఆ కుటుంబం కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. టోరంటో యూనివర్సిటీనుంచి బిఎ డిగ్రీ పట్టా పొందిన జమాల్ మెక్‌గిల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. యేల్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలో పిజి పట్టా పొందారు.

Indian-origin Judge nominated to Canada SC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News